Breaking News

దేవుడి దయతో బతికిపోయాం

Published on Wed, 11/05/2025 - 08:19

తాండూరు రూరల్‌: దేవుడి దయతో బతికిపోయాం అని చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో ప్రాణాలతో బయటపడిన తల్లి పుష్పలత, కూతురు క్రిస్టినా పేర్కొన్నారు. పెద్దేముల్‌ మండలం కందనెల్లి గ్రామానికి చెందిన పుష్పలత కొన్నేళ్లుగా కుటుంబ సభ్యులతో కలిసి తాండూరులో నివాసం ఉంటోంది. పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. పుష్పలతకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స కోసం కూతురు క్రిస్టినాతో కలిసి సోమవారం ఆర్టీసీ బస్సులో బయలుదేరింది. అఖరి సీట్లు ఇద్దరూ కూర్చున్నారు. 

ఒక్కసారిగా భారీ శబ్దంతో బస్సు అదుపుతప్పింది. నేను కిందపడ్డాను. కంకర పొగ వల్ల నా కూతురు కనిపించలేదు. నడుములోతు కంకర ఉంది. మమ్మీ, మమ్మీ అంటూ క్రిస్టినా ఏడుపు వినిపించింది. వెంటనే కూతురి కాళ్ల కింద ఉన్న కంకరను తొలగించా. ఆ తర్వాత ఎడమవైపు కిటికీలోంచి బ్యాగులు బయటకు విసిరేసి దూకేశాం. లిఫ్ట్‌ అడిగి వికారాబాద్‌కు వచ్చాం. అక్కడి నుంచి ఆటోలో తాండూరుకు చేరుకున్నాం. నా భర్త పదేళ్ల నుంచి పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యాడు. ప్రస్తుతం నా ఫ్యామిలీకి నేను ముఖ్యం. నేను బతకాలి. భగవంతుడే నన్ను, నా కూతుర్ని కాపాడాడు. క్రిస్టినాకు మూగ దెబ్బలు తగలడంతో పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నానని తల్లి పుష్పలత తెలిపారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)