Breaking News

నేను కూలి చేసి నా సెల్లిని సదివిస్తా..

Published on Wed, 11/05/2025 - 09:03

వికారాబాద్‌/తాండూరుటౌన్‌: ‘అమ్మకు జెరం వచ్చిందిని.. మా అమ్మమ్మ ఇంటికి పోయివారం ఆయే. నిన్న రాత్రి అమ్మను దవఖానాకు సూపిస్కొస్త అని మా నాయిన గూడపోయిండు.. ఆల్లిద్ద రూ పొద్దుగూకినంక ఒస్తరనుకుంటే పొద్దుగాళ్ల పదిగంట్లకే మీ అమ్మనాయిన చచ్చిపోయిండ్రని ఫోనొచ్చింది’అంటూ తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు బాలికలు విలపించటం కన్నీరు పెట్టించింది. వికారాబాద్‌ జిల్లా హాజీపూర్‌కి చెందిన దంపతులు లక్ష్మి–బందెప్ప బస్సు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఉండటానికి చిన్న ఇల్లు తప్ప ఏ ఆస్తిపాస్తులు లేని ఈ దంపతులు మృతితో వారి ఇద్దరు కూతుళ్లు శిరీష, భవానీ అనాథలయ్యారు. 

వారిని ‘సాక్షి’ పరామర్శించగా తల్లడిల్లిపోయారు. ‘మాయమ్మ, మా నాయిన సచ్చిపోయిండ్రని సుట్టాలందరు ఒచ్చిండ్రు.. రేపెల్లుండి ఎవరిండ్లకు ఆల్లు పోతరు.. ఇంక నేను మా సెల్లె ఇంట్ల ఉండాలె. మాకింక దిక్కెవరు. మాయమ్మతోని కలిసి నేనుగూడ కూలికి పోతుంటి. వారం పదిదినాలసంది పానం బాగలేకపోతె మా అమ్మమ్మ ఇంటికి తోలిచ్చినం. దవాఖానాకు పోయి పానం బాగా చేపిచ్చుకొని ఒస్తమని పోయిండ్రు.. ఇప్పుడు మా నాయిన లేడు. మాయమ్మలేదు. ఎంత కష్టమైనా సరే నేను కూలికి పోయి మా సెల్లిని మంచిగ సదివిపిస్త. మా అమ్మమ్మను తోలుకొచ్చుకోని నా జతకు పండుకోబెట్టుకుంటా..’ అంటూ శిరీష చెప్పుకొచ్చింది.   

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)