Breaking News

చేప ప్రసాదానికి వేళాయే

Published on Sat, 06/08/2024 - 07:33

హైదరాబాద్‌: మృగశిర కార్తెను పురస్కరించుకుని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో బత్తిని కుటుంబం ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు అంతా సిద్ధం చేసినట్లు బత్తిని హరినాథ్, బత్తిని అమర్నాథ్‌ గౌడ్‌ తెలిపారు. కాగా.. శుక్రవారం ఉదయం చేప ప్రసాదం తయారీ కోసం దూద్‌బౌలిలోని తమ స్వగృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ క్రమంలో శుక్రవారం మత్స్యశాఖ, జీహెచ్‌ఎంసీ, పోలీస్‌ తదితర శాఖల అధికారులు ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఏర్పాట్లను పరిశీలించారు.  2 లక్షల చేప పిల్లలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. 

మొత్తం 32 కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. రూ.40 చొప్పున చేప పిల్లల టోకెన్‌ ధర నిర్ణయించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చే ఆస్తమా రోగులు, వారి సహాయకులకు స్వచ్ఛంద సంస్థలు భోజన వసతులు ఏర్పాటు చేశాయి. ఈ ఏడాది సుమారు 5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. చేప ప్రసాదం పంపిణీ శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమై ఆదివారం ఉదయం 6 గంటల వరకు నిర్విరామంగా కొనసాగుతుంది. ఇందుకోసం 300 మంది బత్తిని కుటుంబ సభ్యులు, వలంటీర్లు విడతల వారీగా విధుల్లో ఉంటారు. చేప ప్రసాదం కార్యక్రమ ప్రారం¿ోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆహా్వనించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. కాగా.. ఇప్పటికే ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌కు ఆస్తమా బాధితులు తరలివచ్చారు.  

ట్రాఫిక్‌ ఆంక్షలు.. 
చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. గృహకల్ప, గగన్‌ విహార్‌ల వద్ద తమ వాహనాలను పార్క్‌ చేసి గేట్‌నెం. 2 ద్వారా ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లోకి చేరుకోవాలని 
సూచించారు. వీఐపీలకు గేట్‌నెం.1 నుంచి ప్రవేశం కలి్పంచారు.    

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)