నీటి కాలుష్యానికి రోబోలతో చెక్‌

Published on Fri, 10/17/2025 - 05:18

సాక్షి, హైదరాబాద్‌: భూగర్భ తాగు నీటి జల మార్గాలలో కాలుష్య మూలాలు, లీకేజీలను త్వరితగతిన గుర్తించి సత్వరమే సమస్యను పరిష్కరించేందుకు జలమండలి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఆధారంగా పనిచేసే అత్యాధునిక రోబోలను రంగంలోకి దించింది. ఇవి నేరుగా పైపుల్లోకి వెళ్లి లీకేజీలను, కలుషితాలను గుర్తిస్తాయి. చెన్నైకి చెందిన సోలినాస్‌ ఇంటిగ్రిటీ డీప్‌టెక్‌ సంస్థ ఎండోబోట్‌.. స్వాస్థ్‌ సాంకేతికతతో వీటిని రూపొందించింది. 

సుమారు 70 ఎంఎం నుంచి 250 ఎంఎం డయా పైప్‌లైన్లలో ఈ రోబోలు సాఫీగా పనిచేస్తాయి. పైప్‌లైన్‌లో కాలుష్య కారకాలు కలిసే ప్రాంతం, పైప్‌లైన్‌ జీవితకాలం, అక్రమ ట్యాపింగ్‌ తదితర కీలక సవాళ్లను ఈ రోబోలు గుర్తిస్తున్నాయి. ప్రస్తుతం పైలట్‌ ప్రాజెక్టుగా నాలుగు డివిజన్లలో మూడు రోబోలను ప్రవేశపెట్టారు. 132 ప్రాంతాల్లో నీటి కాలుష్యంపై వచ్చిన ఫిర్యాదులను నెలరోజుల్లోనే ఈ రోబోలతో పరిష్కరించినట్లు జలమండలి వర్గాలు తెలిపాయి. 

అక్రమ కనెక్షన్ల గుర్తింపు
హైదరాబాద్‌లో భూగర్భ నీటి సరఫరా వ్యవస్థలో సమస్యలు తలెత్తి తరచూ నీరు కాలుష్యమవుతోంది. పైప్‌లైన్లలో లీకేజీలతో ఈ సమస్య వస్తోంది. అయితే, భూగర్భంలో ఈ కలుషిత మూలాలను గుర్తించడం జలమండలికి తలకు మించిన భారంగా మారింది. తరచూ రోడ్లపై గుంతలు తవ్వాల్సి వస్తోంది. రెండేళ్ల క్రితం ట్రెంచ్‌లెస్‌ టెక్నాలజీ కెమెరాతో కూడిన అధునాతన ‘క్విక్‌ ఇన్‌స్పెక్షన్‌ వాటర్‌ పొల్యూషన్‌ సిస్టం (క్యూఐడబ్ల్యూపీఎస్‌) యంత్రాలను పలు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా వినియోగించారు. 

కానీ, ఆ యంత్రానికి ఉండే కెమెరా చెడిపోవటం, కేబుల్‌ సమస్య, పాడైన పరికరాలు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలతో ఆర్థికంగా భారంగా మారింది. దీంతో వాటి స్థానంలో రోబోలను ప్రవేశపెడుతున్నారు. ఇవి పైప్‌లైన్‌ లోపల తిరుగుతూ సమస్యను కనుగొంటాయి. జీఐఎస్‌ మ్యాపింగ్‌తో ఆ పైప్‌లైన్‌ మార్గంలో ఉన్న వాటర్‌ కనెక్షన్ల సమగ్ర సమాచారాన్ని అందిస్తాయి. దీంతో అక్రమ, సక్రమ కనెక్షన్ల సమాచారం కూడా రికార్డు అవుతోంది. 

ఈ రోబోలకు లైట్‌తో కూడిన ‘హై రిజల్యూషన్‌ కెమెరా’ఉంటుంది. దానిని పైపులై¯న్‌లోకి పంపించి భూ ఉపరితలంపై ఉండే మానిటర్‌లో పరిస్థితిని ప్రత్యక్షంగా చూడవచ్చు. రోబో గుర్తించే దృశ్యాలతో వీడియో సైతం రికార్డు అవుతోంది. దీంతో కాలుష్యమూలాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి అక్కడ మాత్రమే రోడ్డును తక్షణం రిపేర్లు చేసేందుకు వీలవుతోంది. 

సత్ఫలితాలు ఇస్తే రోబోటిక్స్‌ సేవలు విస్తరిస్తాం
పైప్‌లైన్లలో కాలుష్య మూ లాలను గుర్తించేందుకు ఏఐ రోబోలను ప్రయోగిస్తున్నాం. సమస్య ఎక్కడ ఉందో గుర్తించి అక్కడే రోడ్డు, పైప్‌లైన్‌ కట్‌చేసి మరమ్మతులు చేస్తున్నాం. ప్రస్తు తం పైలట్‌ ప్రాజెక్టుగా నాలుగు డివిజన్లలో అమలు చేస్తున్నాం. సత్ఫలితాలు  వస్తే అన్ని డివిజన్లలో వీటి సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం. – మాయంక్‌ మిట్టల్, ఈడీ, జలమండలి

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)