Breaking News

CV Anand: ఆపాత మధురం.. ‘ఆనంద’ జ్ఞాపకం!

Published on Tue, 01/03/2023 - 13:01

సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని చార్మినార్‌ ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న కేఎస్‌ రవికి అరుదైన అనుభవం దక్కింది. 1997లో విద్యార్థిగా, 2022లో పోలీసు అధికారిగా సీనియర్‌ పోలీసు అధికారి సీవీ ఆనంద్‌ నుంచి ‘బహుమతులు’ అందుకున్నారు. ఈ రెండు ఫొటోలను రవి సోమవారం ట్విట్టర్‌లో పొందుపరిచారు. 

నిజామాబాద్‌కు చెందిన రవి తండ్రి పరమేశ్వర్‌ ఆ జిల్లా పోలీసు విభాగంలో ఆడ్మ్‌ రిజర్వ్‌ హెడ్‌–కానిస్టేబుల్‌గా పని చేశారు. 1996లో పదో తరగతి ఉత్తీర్ణుడైన రవి మంచి మార్కులు సాధించారు. 1998 జనవరి 1న ఆ జిల్లా ఎస్పీగా ఉన్న సీవీ ఆనంద్‌ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఇలా అప్పట్లో ఆనంద్‌ నుంచి రవికి బహుమతి దక్కింది. పోలీసు విభాగంపై మక్కువ పెంచుకున్న రవి 2009లో నగర పోలీసు విభాగంలో సబ్‌–ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికయ్యారు. 

ప్రస్తుతం ఇన్‌స్పెక్టర్‌ హోదాలో చార్మినార్‌ ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌కు నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పుడు అదనపు డీజీ హోదాలో సిటీ కొత్వాల్‌గా ఉన్న ఆనంద్‌ న్యూ ఇయర్‌ డే నేపథ్యంలో ఆదివారం చార్మినార్‌ వద్దకు వెళ్లారు. అక్కడ కేక్‌ కట్‌ చేసిన కొత్వాల్‌ స్వయంగా రవికి తినిపించారు. ఇది కూడా తనకు బహుమతే అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసిన ఇన్‌స్పెక్టర్‌ రవి రెండు ఫొటోలను ట్వీట్‌ చేశారు. ఇది పోలీసు విభాగంలో వైరల్‌గా మారింది. (క్లిక్ చేయండి: ఆ రెండు లైన్‌లలో అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు)

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)