Breaking News

నా భర్త భాస్కర్‌ వికారాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎందుకున్నాడు..!

Published on Tue, 06/24/2025 - 11:28

నారాయణపేట: సినీ ఫక్కీలో చోరీలకు పాల్పడుతూ మోస్ట్‌ వాంటెడ్‌ దొంగగా పోలీసు శాఖలో గుర్తింపు పొందిన చాపల భాస్కర్‌ (35) మృతి అనుమానాస్పదంగా మారింది. బెయిల్‌పై విడుదలైన వ్యక్తిని వికారాబాద్‌ పోలీసులు తీసుకెళ్లారని కుటుంబసభ్యులు చెబుతుంటే.. మాకేం సంబంధం లేదంటున్నారు. దీనికి తోడు సొంతూరులో కాకుండా వేరేరాష్ట్రంలో అంత్యక్రియలు చేయడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. 

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. నారాయణపేట జిల్లా ఊట్కూర్‌కి చెందిన చాపల భాస్కర్‌ కొన్నేళ్లుగా దొంగతనాలను వృత్తిగా చేసుకున్నాడు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌ చేసేవాడు. పోలీసుశాఖలో చాపల భాస్కర్‌ మోస్ట్‌ వాంటెడ్‌గా గుర్తింపు పొందారు. ఆరు మాసాలుగా మహబూబ్‌నగర్‌ జైలులో ఉన్నాడు. కాగా.. ఈ నెల 20వ తేదీన బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే వికారాబాద్‌ జిల్లాలో 14 చోరీల్లో భాస్కర్‌పై కేసులు నమోదు కావడంతో భాస్కర్‌ను మహబూబ్‌నగర్‌ జైలు నుంచి బయటికి వచ్చినవెంటనే సీసీఎస్‌ (సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌) పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు.

వికారాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి చాపలి భాస్కర్‌ భార్య తారమ్మకు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఫోన్‌ చేసి.. మీరొచ్చి మీ భర్తను తీసుకెళ్లాలని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే తన భర్త వికారాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎందుకున్నారంటూ పోలీసులను అడిగినట్లు సమాచారం. అయితే శనివారం ఉదయం 10 గంటల సమయంలో వికారాబాద్‌ నుంచి మఫ్టీలో ఇద్దరు పోలీస్‌ కానిస్టేబుళ్లు ఓ ప్రైవేట్‌ ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చి గుర్మిట్కల్‌ దగ్గరలోని ఓ గ్రామస్టేజీ వద్ద చాపలి భాస్కర్‌ను వారి బంధువుకు అప్పజెప్పారు. అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురైన భాస్కర్‌ను ఓ ప్రైవేట్‌ వాహనాన్ని మాట్లాడించి కానిస్టేబుళ్లు.. అందులో నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేలా చేస్తూ అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు.

ఆస్పత్రికి వచ్చేసరికి మృతి..
స్పృహలో లేని భాస్కర్‌ను ఆస్పత్రికి తీసుకువచ్చే సరికి చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు భాస్కర్‌ వెంబడి వచ్చిన బంధువు చేరవేశారు. వెంటనే భార్య తారమ్మతో పాటు కుటుంబసభ్యులు వచ్చి ఆస్పత్రిలో శవమై కనిపించిన చాపలిభాస్కర్‌ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే నారాయణపేట పీఎస్‌కు వెళ్లగా ఈ కేసు తమ పరిధిలో రాదంటూ సీఐ, ఎస్‌ఐలు చేతులెత్తేసినట్లు తెలిసింది. అక్కడి నుంచి ఓ ప్రైవేట్‌ వాహనంలో శనివారం సాయంత్రం భాస్కర్‌ మృతదేహాన్ని వికారాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ వద్దకు తీసుకెళ్లి.. ఆరా తీశారు. మేము కస్టడీలోకి తీసుకున్నట్లు ఏమైనా ఆధారాలున్నాయా అంటూ బుకాయించినట్లు తెలుస్తోంది.

 దీంతో దీంతో చేసేదేమి లేక తిరిగి నారాయణపేటకు చేరుకున్నారు. చివరకు ఆదివారం నారాయణపేట రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాముడు తెలిపారు. నారాయణపేట ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రిలో చాపలి భాస్కర్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆయన స్వగ్రామం ఊట్కూర్‌ అయినప్పటికీ భాస్కర్‌ అత్తగారి ఊరు కర్ణాటకలోని సంకలాపూర్‌కు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)