Breaking News

మా యూనిట్లు మార్చండి..

Published on Tue, 06/10/2025 - 05:24

సాక్షి, హైదరాబాద్‌: రాజీవ్‌ యువ వికాసం దరఖాస్తుల్లో యూనిట్ల మార్పు, కేటగిరీల సవరణ కోసం అధికారులపై ఒత్తిడి తీవ్రమైంది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న పలువురు అర్జీదారులు వాటిలో మార్పులు కోరుతూ ఆ మేరకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. దరఖాస్తులో మార్పులు చేసేందుకు సంబంధించిన లాగిన్‌ మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి, మున్సిపల్‌ కమిషనర్ల వద్ద ఉండడంతో వారి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. రాజీవ్‌ యువ వికాసం పథకం కింద లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్‌ 2వ తేదీన తొలి రెండు కేటగిరీల్లో ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. కానీ చివరి నిమిషంలో ఎంపిక ప్రక్రియ, మంజూరు కార్యక్రమాన్ని వాయిదా వేసింది. అయితే ప్రభుత్వం తొలి రెండు కేటగిరీ లకే ముందుగా మంజూరు పత్రాలు ఇవ్వనుందనే ప్రచారంతో.. తొలి విడతలోనే లబ్ధిదారులుగా ఎంపికయ్యే ఉద్దేశంతో తొలుత చివరి రెండు కేటగిరీలకు దరఖాస్తు చేసుకున్న వారిలో అనేకమంది, ప్రస్తుతం తమ కేటగిరీలను మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

చివరి రెండు కేటగిరీలకు అధిక దరఖాస్తులు
రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్‌ యువి వికాసం పథకం కింద వివిధ రకాల యూనిట్ల కోసం మొత్తం 4 కేటగిరీల్లో దరఖాస్తులను స్వీకరించింది. ఆన్‌లైన్‌ పద్ధతిలో మార్చి 17న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంక్షేమ శాఖలు..ఏప్రిల్‌ 14వ తేదీ 11.59 గంటల వరకు కొనసాగించింది. మొత్తం 16,23,764 మంది ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్నారు. రూ.50 వేల లోపు పరిమితి ఉన్న యూనిట్లను కేటగిరీ–1గా, రూ.50 వేల నుంచి రూ.1 లక్షలోపు వాటిని కేటగిరీ–2గా, రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు పరిమితి ఉన్న యూనిట్లను కేటగిరీ–3, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల మధ్య ఉన్న యూనిట్లను కేటగిరీ–4గా విభజించింది. తొలి విడతలో కేటగిరీ–1,. కేటగిరీ–2లోని లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది.

ఈ క్రమంలో తొలి రెండు కేటగిరీల్లో వచ్చిన దరఖాస్తుల పరిశీలన చేపట్టింది. అయితే ఈ రెండు కేటగిరీలకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం కంటే తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. కేటగిరీ–1లో 1,58,650 మందికి అవకాశం కల్పించాలని భావించగా.. కేవలం 39,401 దరఖాస్తులే వచ్చాయి. కేటగిరీ–2లో 1,22,540 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోగా.. కేవలం 93,233 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 1,48,556 దరఖాస్తులు తక్కువగా వచ్చాయి. కానీ కేటగిరీ–3, కేటగిరీ–4 కింద మాత్రం అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.

అయితే ప్రభుత్వం తొలుత మొదటి రెండు కేటగిరీలకు చెందిన దరఖాస్తుల పరిశీలనే చేపట్టడం, ఆయా కేటగిరీలకు తక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో.. కేటగిరీ–3, కేటగిరీ–4 కింద దరఖాస్తు చేసుకున్న వారు తొలి విడతలోనే అర్హత సాధించేందుకు, ఆ మేరకు ఆయా యూనిట్లకు మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం స్థానిక ప్రజాప్రతినిధులతో సిఫారసు చేయించుకుంటున్నారు. సుమారు లక్షకు పైబడి దరఖాస్తుదారులు ఈ విధంగా మార్పులు కోరుకుంటున్నట్లు సంక్షేమ శాఖల వర్గాలు తెలిపాయి. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)