Breaking News

విద్యుత్‌ సంస్కరణలకు నేనే మార్గదర్శిని

Published on Mon, 05/15/2023 - 05:00

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అప్పట్లో తాను విజన్‌ 2020 రూపకల్పన చేస్తే తనను అందరూ 420 అంటూ ఎద్దేవా చేశారని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్‌. చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. తన విజన్‌ 2020 వల్లే హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందన్నారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో జరిగిన స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ తొలి గ్రాడ్యుయేషన్‌ వేడుకకి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.

దేశంలో వచ్చిన పలు ఆర్థిక సంస్కరణలకు తానే కారణమని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా విద్యుత్‌ సంస్కరణకు తానే మార్గదర్శినన్నారు. తాను తెచ్చిన సంస్కరణల వల్ల ఇప్పుడు దేశంలో విద్యుత్‌ రంగం అభివృద్ధి చెందిందన్నారు. అదేవిధంగా టెలికాంలోనూ సంస్కరణలు తేవాలని నాటి ప్రధాని వాజ్‌పేయ్‌కు చెప్పానని చెప్పుకున్నారు.

ఇక తాను రూపకల్పన చేసిన పాలసీల కారణంగానే హైటెక్‌ సిటీ, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, జినోమ్‌ వ్యాలీ, గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులు వచ్చాయని చెప్పారు. జినోమ్‌ వ్యాలీలోనే ఇప్పుడు కరోనాకు వ్యాక్సిన్‌ ఉత్పత్తి జరుగుతోందన్నారు.

డిజిటల్‌ కరెన్సీతో ఎన్నికల్లో డబ్బు ప్రవాహానికి చెక్‌
రూ.500, రూ.2 వేల పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా దేశంలో నల్లదనం ప్రవాహం, అవినీతిని రూపుమాపవచ్చని చంద్రబాబు అన్నారు. డిజిటల్‌ కరెన్సీతో ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంపిణీ వంటి అవినీతికి అడ్డుకట్ట పడుతుందని చెప్పారు. పబ్లిక్, ప్రభుత్వం, ప్రైవేట్, పార్టనర్‌ షిప్‌ (పీ–4)తో వేగంగా ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

తాను అప్పట్లో ప్రైవేట్, పబ్లిక్, పార్ట్‌నర్‌షిప్‌ (పీ–3) పాలసీతోనే తాను హైటెక్‌ సిటీని నిర్మించానన్నారు. బయోటెక్నాలజీకి సంబంధించి అప్పట్లో బిల్‌గేట్స్‌ తనకు చెప్పారని గుర్తు చేశారు. కార్యక్రమంలో గీతం యూనివర్సిటీ చాన్స్‌లర్‌ వీరేందర్‌సింగ్‌ చౌహాన్, ప్రెసిడెంట్‌ ఎం.శ్రీభరత్, వీసీ ప్రొఫెసర్‌ దయానంద సిద్దవటం, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)