Breaking News

ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కింద రూ.3,448 కోట్లు

Published on Sat, 09/07/2024 - 06:08

సాక్షి, హైదరాబాద్‌: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన రెండు తెలుగు రాష్ట్రాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) కింద రూ.3,448 కోట్లు వెంటనే విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వరద ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు అక్కడి రైతులను, ప్రజలను కలిసి పరిస్థితులను అంచనా వేసిన అనంతరం.. రెండు రాష్ట్రాల సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబులతో చర్చించిన తర్వాత ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

రెండు రాష్ట్రాలకు పూర్తిస్థాయిలో సాయం అందించడానికి కట్టుబడి ఉన్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. తెలంగాణలో పంటలు దెబ్బతిన్న మీనవాలు, పెద్దగోపవరం, మన్నూరు, కట్టలేరు పరిశీలించడంతో పాటు ఖమ్మంలో మున్నేరు వరదను ఏరియల్‌ సర్వే చేసినట్లు వెల్లడించారు. ఎవరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, ప్రధాని నరేంద్ర మోదీ అందర్నీ ఆదుకుంటారని భరోసా ఇచ్చారు.  

నష్టం అంచనా వేసిన తర్వాత పరిహారంపై నిర్ణయం 
వరదల వల్ల జరిగిన పంటనష్టాన్ని అంచనా వేసిన తర్వాత ఏ మేరకు నష్టపరిహారం ఇవ్వాలన్నది నిర్ణయిస్తామని చౌహాన్‌ చెప్పారు. వరదల్లో అరటి, పసుపు, కూరగాయ ల పంటలు పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలిపారు. ఇది ఊహించని విపత్తు అని మంత్రి వ్యాఖ్యానించారు. రైతులను ఆదుకోవడం, పంటల బీమా పథకం అమలు, రైతులు పొలాల్లో పనిచేసుకునే పరిస్థితులు కలి్పంచడం, తదుపరి పంటలు వేసుకునేలా సహకరించడం.. కేంద్ర ప్రభుత్వ నాలుగు ప్రాథమ్యాలని పేర్కొన్నారు. ఎరువులు, విత్తనాలకు ఎలాంటి లోటు లేకుండా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)