Breaking News

రెండు జాతీయ రహదారుల విస్తరణకు లైన్‌క్లియర్‌

Published on Fri, 11/21/2025 - 02:38

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రెండు కీలక జాతీయ రహదారుల్లో వాహనాలు వేగంగా ముందుకు సాగే వీలు లేకుండా ఇబ్బంది పెడుతున్న అడ్డంకులను అధిగమించేందుకు మార్గం సుగమమైంది. ఆ రోడ్లలో నాలుగు ప్రాంతాల్లో బైపాస్‌లను నిర్మించనున్నారు. ఎన్‌హెచ్‌–63 (నిజామాబాద్‌–జగదల్‌పూర్‌ రహదారి), ఎన్‌హెచ్‌–563 (జగిత్యాల–కరీంనగర్‌–వరంగల్‌–ఖమ్మం రహదారి)లను భారత్‌మాల పరియోజనలో భాగంగా నాలుగు లేన్లకు విస్తరించనున్న విషయం తెలిసిందే. కానీ, విస్తరణకు కావాల్సిన భూసేకరణ మొదలు ఇతర చాలా అంశాల్లో అడ్డంకులు నెలకొనటంతో పనులు ప్రారంభం కాకుండా జాప్యం జరుగుతూ వస్తోంది. తాజాగా ఆయా అడ్డంకులను అధిగమిస్తూ ఎన్‌హెచ్‌ఏఐ విస్తరణ పనులకు టెండర్లు తెరిచి నిర్మాణానికి మార్గం సుగమం చేసింది.

మొత్తం 271 కి.మీ. నిడివి గల విస్తరణ పనులకు రూ.10,034 కోట్ల మొత్తానికి కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదముద్ర వేసింది. ఆర్మూర్‌–జగిత్యాల, జగిత్యాల–కరీంనగర్, జగిత్యాల–మంచిర్యాల మధ్య ఈ పనులు జరగనున్నాయి వచ్చే ఫిబ్రవరిలో పనులు మొదలయ్యే అవకాశముంది. ఎన్‌హెచ్‌–63లో (ఆర్మూర్‌–మంచిర్యాల సెక్షన్‌)ఆర్మూర్‌–జగిత్యాల మధ్య 64 కి.మీ. నిడివి నిర్మాణానికి రూ.2,338 కోట్లు వ్యయం చేయనున్నారు. తాజా లైన్‌ క్లియర్‌తో మూ డేళ్లలో నిర్మాణం పూర్తి చేసుకోనుంది. ఇదే రోడ్డులో జగిత్యాల–మంచిర్యాల మధ్య 68కి.మీ. మేర మరో ప్యాకేజీ పనులు జరగనున్నాయి. ఇందుకు రూ.2,550 కోట్లు వ్యయం కానుంది. ఈపీసీ మోడల్‌లో టెండర్లు ఆమోదించారు. ఇప్పుడు ఎట్టకేలకు పనులు మొదలు కానున్నాయి. ఇక్కడి కోల్‌ బెల్ట్‌కు ఈ రోడ్డు విస్తరణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.  

⇒ ఎన్‌హెచ్‌–563 (జగిత్యాల–వరంగల్‌)లో భాగంగా జగిత్యాల–కరీంనగర్‌ మధ్య 59 కి.మీ. నిడివిని 4 వరుసలుగా విస్తరించనున్నారు. ఇందుకు రూ.2,484 కోట్లు ఖర్చు చేస్తారు. రోడ్డు విస్తరణతోపాటు జంక్షన్‌లను కూడా విస్తరించనుండటంతో ట్రాఫిక్‌ చిక్కులు దూరం కానున్నా యి. సెంట్రల్‌ లైటింగ్‌ కూడా ఏర్పాటు చేస్తారు. ఈ పనులను హ్యామ్‌ పద్ధతిలో నిర్వహిస్తారు. దీని విస్తరణతో జగిత్యాల–వరంగల్‌ మధ్య ప్రయాణ సమయం గంటన్నర మేర తగ్గుతుంది. కరీంనగర్‌–వరంగల్‌ మధ్య 16 కి.మీ. మేర రూ.500 కోట్లతో రోడ్డును మెరుగుపరచనున్నారు.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)