Breaking News

కాజీపేటలో రైల్‌ వ్యాగన్ల తయారీ

Published on Wed, 02/08/2023 - 03:05

సాక్షి, హైదరాబాద్‌: కాజీపేటకు మంజూరు కావాల్సిన కోచ్‌ ఫ్యాక్టరీని కేంద్రం ఎగ్గొట్టిందని రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతున్న సమయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కాజీపేటకు మంజూరై పనులు ప్రారంభించుకున్న పీరియాడికల్‌ ఓవర్‌హాలింగ్‌ వర్క్‌షాప్‌ (పీఓహెచ్‌) స్థాయి పెంచి వ్యాగన్ల తయారీ యూనిట్‌గా మార్చాలని నిర్ణయించింది. వర్క్‌షాప్‌ అంచనా వ్యయం రూ.269 కోట్లు కాగా, తాజా నిర్ణయంతో దానిని రూ.521 కోట్లకు పెంచారు.

ఐదు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పించిన వార్షిక బడ్జెట్‌లో దీని ఊసు లేకపోవటం గమనార్హం. దీంతో బడ్జెట్‌ తయారీ తర్వాత కేంద్రం దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్‌ తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ దీనికి సంబంధించిన కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు గూడ్స్‌ రైళ్లకు సంబంధించిన వ్యాగన్ల తయారీ యూనిట్‌ ఏర్పాటుకు రైల్వే బోర్డు చర్యలు ప్రారంభించిందని ఓ సీనియర్‌ రైల్వే అధికారి ‘సాక్షి’తో చెప్పారు.  

ఆ వివాదంతోనేనా.. 
కాజీపేటకు 1980లలో కోచ్‌ ఫ్యాక్టరీ మంజూరైంది. దాని ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్న సమయంలో నాటి ప్రధాని ఇందిర హత్య జరిగింది. అప్పుడే సిక్కులపై ప్రతీకార దాడులు తీవ్రం కావటంతో పంజాబ్‌లో పరిస్థితి చేయిదాటింది. సిక్కులను చల్లార్చే క్రమంలో కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీని పంజాబ్‌లోని కపుర్తలాకు తరలించే నిర్ణయం తీసుకున్నారు.

అప్పటినుంచి ఈ డిమాండ్‌ పెండింగులో ఉండిపోయింది. రాష్ట్ర విభజన సమయంలో దాని ఏర్పాటు సాధ్యాసాధ్యాల పరిశీలనకు కమిటీ వేస్తామన్న కేంద్రం ఆ మేరకు కమిటీ వేసింది. కోచ్‌ ఫ్యాక్టరీల అవసరం లేదన్న ఆ కమిటీ అభిప్రాయం మేరకు కాజీపేటకు పీరియాడికల్‌ ఓవర్‌హాలింగ్‌ వర్క్‌షాప్‌ మంజూరు చేశారు. ఇది వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.  

రైల్వేకు ఇది రెండో యూనిట్‌.. 
దేశవ్యాప్తంగా రైల్వేకు కోచ్‌ ఫ్యాక్టరీలు చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. కానీ గూడ్సు వ్యాగన్ల తయారీకి ప్రభుత్వరంగ కేంద్రం ఒక్కటే ఉంది. కాగా కాజీపేటలో వ్యాగన్‌ తయారీ కేంద్రం ఏర్పాటైతే ప్రభుత్వ పరంగా రెండో యూనిట్‌ అవుతుంది. రైల్వే సొంత యూనిట్‌గా మారుతుంది.

పవర్‌ మెక్‌–టైకిషా జేవీ అన్న సంస్థ కాజీపేట పీఓహెచ్‌ టెండర్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే. దానికి కావాల్సిన 160 ఎకరాల భూమికి గాను ఇప్పటివరకు రాష్ట్రప్రభుత్వం 150 ఎకరాలను రైల్వేకు అందజేసింది. దీంతో అక్కడ వర్క్‌షాప్‌ ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయి. కేంద్ర బడ్జెట్‌లో దానికి రూ.160 కోట్లు కేటాయించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)