Breaking News

జల వివాదాలపై కేంద్రం దృష్టి

Published on Tue, 07/15/2025 - 06:36

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై కేంద్రం దృష్టి సారించింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ ఈ నెల 16న మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో రెండు రాష్ట్రాల సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబుతో సమావేశం ఏర్పాటు చేసినట్లు.. ఆ శాఖ సంయుక్త కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌ అగర్వాల్‌ తెలిపారు. ఈ మేరకు సోమవారం రెండు రాష్ట్రాలకు లేఖ రాశారు. ఈ భేటీలో చర్చించడానికి రెండు రాష్ట్రాలూ తమ ఎజెండా అంశాలను తక్షణమే పంపించాలని కోరారు. సీఎంలతో పాటు సమావేశానికి రానున్న ప్రతినిధి బృందాల వివరాలను కూడా పంపించాలని సూచించారు. 

తెలంగాణ వాటాల కోసం కేంద్రంపై ఒత్తిడి
కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన ప్రతి నీటి బొట్టును సాధించడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. కృష్ణా బేసిన్‌లోని రాష్ట్ర ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్సు ఇవ్వాలని, నీటి కేటాయింపులతో పాటు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని కోరనున్నారు. 16న ఢిల్లీలో జరిగే సమావేశంలో రాష్ట్ర నీటి వాటాల సాధనతో పాటు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, కొత్త ప్రాజెక్టులకు పట్టుబట్టాలని నిర్ణయించారు. ‘కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణకు తీరని ద్రోహం జరిగింది. 

కేసీఆర్‌ ప్రభుత్వం కృష్ణా జలాల్లో న్యాయంగా రావాల్సిన నీటి వాటాల సాధించడంలో దారుణంగా విఫలమైంది. తెలంగాణకు 299 టీఎంసీల నీటి వాటాకు అంగీకరించి ఏపీకి 512 టీఎంసీలు కట్టబెట్టింది. శ్రీశైలం ఎగువన ఏపీ అక్రమంగా నిర్మించుకున్న ప్రాజెక్టులన్నింటికీ వంత పాడింది. కృష్ణా నీళ్లను ఏపీ యధేచ్ఛగా మళ్లించుకుంటే మౌనం వహించింది. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణాపై నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఇవ్వకుండా అసంపూర్తిగా వదిలేసింది..’ అని సీఎం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.   

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)