Breaking News

హైదరాబాద్‌ పర్యటనలో సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌

Published on Thu, 12/18/2025 - 15:02

సాక్షి,హైదరాబాద్‌: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌ అధికారిక పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆయన మధ్యాహ్నం 12.00 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు.

హైదరాబాద్‌కు వచ్చిన అనంతరం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలానికి ప్రయాణం చేయనున్నారు. ఆయన సాయంత్రం 6.30 గంటలకు శ్రీశైలంలోని బ్రహ్మరాంభ గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు. మరుసటి రోజు తెల్లవారుజామున ఆయన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో మహా ఆరతి కార్యక్రమంలో పాల్గొని దర్శనం చేసుకుంటారు. శ్రీశైలంలో సీఈసీ పర్యటన పూర్తిగా భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం కాగా, ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి అధికారిక సమావేశాలు లేదా పరిపాలనా కార్యక్రమాలు ఉండవని అధికారులు తెలిపారు.

హైదరాబాద్ షెడ్యూల్‌లో భాగంగా జ్ఞానేశ్‌కుమార్‌ నగరంలోని చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం గల ప్రాంతాలను సందర్శించనున్నారు. ఇందులో గోల్కొండ కోట, హుస్సేన్‌సాగర్, చార్మినార్, సాలార్‌జంగ్ మ్యూజియం ఉన్నాయి. అదేవిధంగా ఎన్నికల నిర్వహణలో కీలకమైన తెలంగాణ రాష్ట్ర బూత్ లెవల్ అధికారులతో (బీఎల్‌వోలు) రవీంద్రభారతి ఆడిటోరియంలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల ప్రక్రియను మరింత పటిష్టంగా అమలు చేయడంపై దిశానిర్దేశం చేయనున్నారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా యంత్రాంగం సమన్వయంతో చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)