సీబీఐటీలో పీజీ విద్యార్థులకు ఓరియెంటేషన్ ప్రోగ్రాం

Published on Thu, 11/06/2025 - 21:07

చైతన్య భారతీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ (CBIT)లో కొత్తగా చేరిన పీజీ విద్యార్థుల కోసం ఓరియెంటేషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అకాడమిక్ అండ్ ఎగ్జామినేషన్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఈ, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ మొదటి సెమిస్టర్ విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సివీ నరసింహులు స్వాగత ప్రసంగంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సీబీఐటీ పరిపాలనా బృందం డిప్యూటీ ప్రిన్సిపాల్‌లు, డైరెక్టర్లు, విభాగాధిపతులు, లైబ్రేరియన్, ఇతర అధికారులు, విద్యార్థులకు పరిచయం చేశారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రవి కుమార్ మెదురి (ఇన్నోమైండ్స్) కృత్రిమ మేధస్సు రంగంలో అవకాశాలపై ప్రేరణాత్మక ఉపన్యాసం ఇచ్చారు. గౌరవ అతిథిగా పాల్గొన్న ఎం.ఎల్. నరసింహన్ (ఎవెర్ నార్త్ హెల్త్ సర్వీసెస్) నిరంతర అభ్యాసం, స్వీయ అభివృద్ధి ప్రాధాన్యతను వివరించారు.

విద్యార్థుల ప్రగతికి మార్గదర్శకంగా సీబీఐటీ అకాడమిక్  ప్రొఫెసర్ పి.వి.ఆర్. రవీంద్ర రెడ్డి, కె.కృష్ణవేణి, సురేశ్ పబ్బోజు, పి.ప్రభాకర్ రెడ్డి, బి. లింగ రెడ్డి, డా. ఎన్.ఎల్.ఎన్.రెడ్డి తమ సూచనలు అందించారు. కార్యక్రమాన్ని డా. రాహుల్, డా. బి.లావణ్య,పీ. కృష్ణ ప్రసాద్ సమన్వయం చేశారు. ముఖ్య అతిథులకు స్మారక చిహ్నాల ప్రదానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వోటు ఆఫ్ థ్యాంక్స్‌తో కార్యక్రమం ముగిసింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)