Breaking News

Hyderabad: యాలకుల దొంగ అరెస్టు

Published on Sat, 07/05/2025 - 07:46

హైదరాబాద్: నగలు, నగదు దొంగలించేవారిని చూశాం..మొబైల్స్‌ను తస్కరించిన వారిని చూశాం. ఆఖరికి కేబుళ్లను చోరీ చేసిన వారినీ చూశాం. కానీ ఓ దొంగ విచిత్రంగా ఇలాచీలు (యాలకులు) దొంగిలించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదేమిటని పోలీసులు ప్రశి్నస్తే ఇలాచీలు విలువైనవే కదా అంటూ సమాధానమివ్వడం గమనార్హం. సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలను ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు తెలిపిన ప్రకారం..

సనత్‌నగర్‌లోని డీమార్ట్‌ షోరూంలో ఇటీవల 100 గ్రాముల ఇలాచీ ప్యాకెట్లు మాయమవుతున్నట్లు సిబ్బంది గుర్తించారు. ఓ రోజు సీసీ ఫుటేజీని తనిఖీ చేయగా ఓ వ్యక్తి ఇలాచీ ప్యాకెట్లను తీసుకుని వాష్‌రూమ్‌లోకి వెళ్లి లో దుస్తుల్లో దాచుకుని వెళ్తున్నట్లు వెల్లడైంది. అదే రోజు సాయంత్రం మళ్లీ సదరు వ్యక్తి షోరూంకు వచ్చి ఇలాచీ ప్యాకెట్లు ఉన్న చోటికి వెళ్లి మరో రెండు 100 గ్రాముల ఇలాచీ ప్యాకెట్లను తీసుకుని లో దుస్తుల్లో దాచుకున్నాడు. 

అతను తిరిగి వెళ్లిపోతుండగా సిబ్బంది పట్టుకుని సనత్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో తన పేరు దీపక్‌ అని, క్యాటరింగ్‌ పనులు చేస్తుంటానని వెల్లడించారు. ఇలాచీలు ఖరీదు ఎక్కువని చోరీకి పాల్పడుతున్నట్లు తెలిపాడు. ఇప్పటివరకు పలుమార్లు షోరూంకు వచ్చి 100 గ్రాముల చొప్పున ప్యాక్‌ చేసి ఉన్న 22 ప్యాకెట్లను తస్కరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితుడిని దీపక్‌కుమార్‌ను అరెస్టు చేసి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)