Breaking News

బంజారాహిల్స్‌లో కారు చోరీ.. ఖైరతాబాద్‌లో చైన్‌ స్నాచింగ్‌..

Published on Sat, 01/25/2025 - 10:49

బంజారాహిల్స్‌: చైన్‌ స్నాచింగ్‌ చేసేందుకు ఓ వ్యక్తి ఏకంగా  కారు చోరీకి పాల్పడిన సంఘటన బంజారాహిల్స్, ఖైరతాబాద్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్‌ రోడ్డునెంబర్‌–12లోని ఎన్‌బీటీనగర్‌ బస్తీకి చెందిన అఫ్రోజ్‌ తన మారుతీ వ్యాన్‌లో పాఠశాల విద్యార్థులను తీసుకెళ్లేవాడు. గురువారం రాత్రి కారులో సాంకేతిక సమస్య తలెత్తడంతో రిపేరు చేయాలని రోడ్డునెంబర్‌–12లోని కమాన్‌లో మెకానిక్‌కు కారు అప్పగించి ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి వరకు కారుకు మరమ్మతులు చేసిన మెకానిక్‌ షెడ్‌కు తాళం వేసీ ఇంటికి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం వ్యాన్‌ తీసుకెళ్లేందుకు అక్కడికి వచి్చన ఆఫ్రోజ్‌కు షెడ్‌ ఎదుట కారు కనిపించలేదు. 

దీంతో మెకానిక్‌కు ఫోన్‌ చేయడంతో తాను కారు అక్కడే పార్కింగ్‌ చేసి వెళ్లిపోయానని చెప్పిన అతను ఘటనా స్థలానికి పరిగెత్తుకొచ్చాడు. పరిసర ప్రాంతాల్లో గాలించినా  కారు కనిపించకపోవడంతో బాధితుడు ఆఫ్రోజ్‌ బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కారు తాజ్‌కృష్ణా హోటల్‌ వైపు వెళ్లినట్లుగా గుర్తించారు. కాగా ఉదయం 9.45 గంటల ప్రాంతంలో ఆనంద్‌నగర్‌ కాలనీలో ఓ మహిళ మెడలో గొలుసు చోరీకి గురైనట్లు ఖైరతాబాద్‌ పోలీసులకు సమాచారం అందింది. అక్కడి పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలించగా మారుతీ వ్యాన్‌లో వచ్చిన ఓ వ్యక్తి కారు దిగి కొంతదూరం నడిచి వెళ్లి రోడ్డుపై వెళుతున్న నర్సమ్మ అనే మహిళ మెడలోని 2.5 తులాల బంగారు గొలుసు లాక్కుని  పరారైనట్లుగా గుర్తించారు. 

దీంతో కంట్రోల్‌ రూం నుంచి అన్ని ఠాణాలకు సమాచారం అందించారు. బంజారాహిల్స్‌లో చోరీకి గురైన కారు అదేనని గుర్తించారు. దీంతో అటు ఖైరతాబాద్‌ పోలీసులు, ఇటు బంజారాహిల్స్‌ పోలీసులు ప్రత్యేక బృందీలను ఏర్పాటు చేసి దొంగ కోసం గాలింపు చేపట్టారు. ఈ విషయాన్ని పసిగట్టిన సదరు దొంగ కారును ఖైరతాబాద్‌లో వదిలేసి సందుల్లో పడి ఉడాయించినట్లుగా తేలింది. అర్ధరాత్రి బంజారాహిల్స్‌లో కారు దొంగిలించిన అతను ఉదయం వరకు అటూ ఇటూ తిరుగుతూ ఆనంద్‌నగర్‌ కాలనీలో ఒంటరిగా కనిపించిన మహిళను టార్గెట్‌ చేసుకుని చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడినట్లుగా పోలీసులు నిర్థారించారు. స్నాచర్‌ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. వెస్ట్‌–సెంట్రల్‌ జోన్ల సరిహద్దులో ఈ ఘటన చోటు చేసుకోవడంతో బంజారాహిల్స్, ఖైరతాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)