Breaking News

ఆనందంగా పెళ్లి ఊరేగింపు.. అంతలోనే ప్రమాదం..!

Published on Sat, 03/08/2025 - 10:17

కరీంనగర్‌ జిల్లా: పెళ్లి బరాత్‌లో జరిగిన కారు ప్రమాదంలో గాయపడిన బాకారపు ఉమ (35) శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు ఎస్సై రవి తెలిపారు. మండలంలోని మెట్‌పల్లి గ్రామానికి చెందిన బాకారపు ప్రభా కర్‌ కూతురు నవ్య వివాహం మానకొండూర్‌ మండలం చెంజర్ల గ్రామానికి చెందిన జినుక అశోక్‌తో గురువారం జరిగింది. రాత్రి పెళ్లి బరాత్‌ జరుగుతుండగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్లకు చెందిన కారు డ్రైవర్‌ శ్రవణ్‌ కారు దిగి ఫోన్‌ మాట్లాడుతున్నాడు. 

బరాత్‌లో కొందరు డ్యాన్స్‌ చేస్తుండగా పెళ్లికొడుకు అశోక్‌ కారు నడిపాడు.  ఒక్కసారిగా బాకారపు ఉమ, ఆమె కూతురు నిఖితతోపాటు మరి కొందరిని కారు ఢీకొనడంతో గాయపడ్డారు. తీవ్రగాయాలైన ఉమ, నిఖితను హుజూ రాబాద్, వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఉమ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. 

కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రమాదానికి పెళ్లి కొడుకు జినుక అశోక్‌ కారణమంటూ ఉమ భర్త పర్శరాములు కేశవపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళన చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారికి పరిహారం ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు.  హుజూరాబాద్‌ రూరల్‌ సీఐ వెంకటి, ఎస్సై రవి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)