Breaking News

కావాల్సిన సింబల్‌ను కోరలేరు

Published on Thu, 06/27/2024 - 03:36

సాక్షి, హైదరాబాద్‌: ప్రజా ప్రాతినిధ్య చట్టం – 1951లో నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల్లో తమకు ఫలానా గుర్తే కావాలని ఎవరూ కోరలేరని హైకోర్టులో ఎన్నికల కమిషన్‌ వాదనలు వినిపించింది. దీంతో ‘చపాతీ రోలర్‌’గుర్తును ఎంపిక జాబితాలో చేర్చాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను పిటిషనర్‌ ఉపసంహరించుకున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల ఉండటంతో ఎన్నికల గుర్తు జాబితాలో ‘చపాతీ రోలర్‌’ను చేర్చాలని కోరుతూ హైకోర్టులో అలయన్స్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫారమ్స్‌ పార్టీ పిటిషన్‌ దాఖలు చేసింది. 

ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ అనిల్‌ కుమార్‌ జూకంటి ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది వాదన లు వినిపిస్తూ...గతంలో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్ని కల్లో పిటిషనర్‌ పార్టీ అభ్యర్థులు ‘చపాతీ రోలర్‌’ గుర్తుపై పోటీ చేశారన్నారు. మండల పరిషత్‌ ప్రాదే శిక నియోజకవర్గం, జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియో జకవర్గం, పట్టణ స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో అదే గుర్తు కేటాయించేలా ఈసీకి ఆదేశాలి వ్వాలని కోరారు.

ఈసీ తరఫు న్యాయవాది జి. విద్యాసాగర్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం అలాంటి వెసులుబాటు లేనందున ఉన్న జాబితా నుంచే ఏదో ఒక గుర్తు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలో పిటిషన్‌ను ఉపసంహరించుకునే అవకాశం ఇవ్వాలని పిటిషనర్‌ న్యాయవాది కోరడంతో ధర్మాసనం అంగీకరించింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)