Breaking News

గ్రూప్‌–1.. లైన్‌క్లియర్‌

Published on Thu, 09/25/2025 - 01:49

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో గ్రూప్‌–1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు విడుదల చేసింది. వివరాలను టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. మొత్తం 563 ఖాళీల భర్తీకి టీజీపీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. ఇందులో 562 పోస్టులను అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేసింది. ఒక పోస్టును మాత్రం హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పెండింగ్‌లో ఉంచింది. 

రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని 18 పోస్టు కోడ్‌లకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు కమిషన్‌ కార్యదర్శి ప్రియాంక ఆల బుధవారం అర్థరాత్రి విడుదల చేసిన వెబ్‌నోట్‌లో ప్రకటించారు. అభ్యర్థుల తుది జాబితాను ఈ ఏడాది మార్చి 30న విడుదల చేసిన జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టు ఆధారంగా ఖరారు చేసినట్లు ఆమె తెలిపారు. గ్రూప్‌–1 తుది ఫలితాలు హైకోర్టు రిట్‌ అప్పీల్‌ నంబర్‌ 1066/2025, ఇతర పెండింగ్‌లో ఉన్న అన్ని రిట్‌ పిటిషన్లకు లోబడి ఉంటాయని స్పష్టం చేశారు. 

గ్రూప్‌–1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఇచ్చిన సమాచారం, ధ్రువపత్రాల వివరాల ఆధారంగా ఎంపిక జరిగిందని, ఈ వివరాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే తక్షణమే వారికి సంబంధించిన నియామక ప్రక్రియను పూర్తిగా రద్దు చేయడం జరుగుతుందని, తెలంగాణ గెజిట్‌ నంబర్‌ 60: తేదీ. 28/12/2015లో పొందుపర్చిన టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో వివరించారు. 
 
గ్రూప్‌–1 టాపర్లు వీరే
లక్ష్మీ దీపిక, దాడి వెంకటరమణ, వంశీ కృష్ణారెడ్డి, జిన్న తేజస్విని, సిద్దాల కృతిక, హర్షవర్ధన్, కె.అనూష, ఏరండ్ల నిఖిత, కె.భవ్య, శ్రీకృష్ణ సాయి. వీరంతా డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులకు ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు ఒకట్రెండు రోజుల్లో సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఇచ్చే అవకాశం ఉంది.    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)