Breaking News

మహిళలకు కేన్సర్‌ గండం

Published on Mon, 03/02/2026 - 06:15

సాక్షి, హైదరాబాద్‌: మహిళల్లో పెరుగుతున్న కేన్సర్‌ వ్యాధులు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో గత ఐదేళ్లలో బ్రెస్ట్, సరై్వకల్, ఓవేరియన్‌ కేన్సర్‌ కేసులు పెరుగుతున్న తీరు ఇందుకు కారణం. 2021 నుంచి 2025 వరకు నమోదైన అంచనా గణాంకాలను జాతీయ కేన్సర్‌ రిజిస్ట్రీ కార్యక్రమం (ఎన్‌సీడీఐఆర్‌) విడుదల చేసింది. ఇందులో ఏటా కేన్సర్‌ కేసులు పెరుగుతున్న తీరును స్పష్టం చేసింది. 2021లో దేశంలో బ్రెస్ట్‌ కేన్సర్‌ కేసులు 2,13,263 ఉండగా 2025 నాటికి ఇవి 2,40,381కు పెరిగాయి. సరై్వకల్‌ కేన్సర్‌ కేసులు 76,898 నుంచి 79,239కు పెరిగాయి. ఓవేరియన్‌ కేన్సర్‌ కేసులు 45,217 నుంచి 49,449కు చేరాయి. మరణాల విషయానికొస్తే 2021లో బ్రెస్ట్‌ కేన్సర్‌ మరణాలు 91,704 ఉండగా 2025లో 1,03,363కు పెరిగాయి. సరై్వకల్‌ కేన్సర్‌ మరణాలు 41,523 నుంచి 42,789కు పెరగగా, ఓవేరియన్‌ కేన్సర్‌ మరణాలు 27,584 నుంచి 30,167కు చేరాయి.  

రాష్ట్రంలోనూ పెరుగుతున్న కేసులు 
రాష్ట్రంలో కూడా మహిళల్లో కేన్సర్‌ కేసుల పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. 2021లో బ్రెస్ట్‌ కేన్సర్‌ కేసులు 6,258 ఉండగా 2025 నాటికి అవి 7,084కి పెరిగాయి. ఇక సరై్వకల్‌ కేన్సర్‌ కేసులు 2021లో 3,169 నమోదు కాగా 2025లో 3,233కు పెరిగాయి. ఓవేరియన్‌ కేన్స ర్‌ కేసులు 1,231 నుంచి 1,365కు పెరిగాయి. మరణాల పరంగా బ్రెస్ట్‌ కేన్సర్‌ మరణాలు 2,691 నుంచి 3,046కి, సరై్వకల్‌ కేన్సర్‌ మరణా లు 1,711 నుంచి 1,746కి, ఓవేరియన్‌ కేన్సర్‌ మరణాలు 751 నుంచి 833కి పెరిగాయి. 

ఉత్తరాదిలో అధికం 
ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ మూడు రకాల కేన్సర్‌ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. 

ముందస్తు స్క్రీనింగ్‌ అవసరం 
మహిళలు 30 ఏళ్ల వయసు దాటిన తర్వాత బ్రెస్ట్‌ పరీక్షలు, గర్భాశయ ద్వారం స్క్రీనింగ్‌ (పాప్‌ స్మియర్‌), అ్రల్టాసౌండ్‌ పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రారంభ దశలో గుర్తిస్తే కేన్సర్‌ను పూర్తిగా నయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. తాజాగా రా ష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ 14 ఏళ్లు నిండిన బాలికలకు వ్యాక్సిన్‌ను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు.  

#

Tags : 1

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)