Breaking News

జూనియర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌–2 పరీక్ష రద్దు

Published on Wed, 08/30/2023 - 03:25

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి యాజమాన్యానికి హైకోర్టు షాక్‌ ఇచ్చింది. గత సంవత్సరం నిర్వహించిన జూనియర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌–2 పరీక్షను రద్దు చేసింది. నిర్వహణలో పలు అవకతవకల కారణంగా పరీక్షను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అన్ని జాగ్రత్తలు తీసుకుని, నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ పరీక్షను మళ్లీ నిర్వహించాలని తేల్చిం చెప్పింది. అభ్యంతరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తుది కీ విడుదల చేయాలని సంస్థను ఆదేశించింది.

ఈ మేరకు ప్రధాన పిటిషన్‌ను అనుమతిస్తూ తుది తీర్పు వెలువరించింది. అలాగే స్టే ఎత్తివేయాలంటూ దాఖలైన మధ్యంతర అప్లికేషన్లను కొట్టివేసింది. సింగరేణి వ్యాప్తంగా 177 జూనియర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌–2 పోస్టులను భర్తీ చేసేందుకు 2022, సెపె్టంబర్‌ 4న నిర్వహించిన పరీక్షకు 79,898 మంది హాజరయ్యారు. ఆ తర్వాత సింగరేణి ‘కీ’ని విడుదల చేయలేదు.

ఈ నేపథ్యంలో పరీక్ష సందర్భంగా మాస్‌ కాపీయింగ్, ఇతర అవకతవకలు జరిగాయంటూ రామగుండంకు చెందిన అభిలాష్‌ సహా పలువురు హైకోర్టులో పిటిషన్‌ దా ఖలు చేశారు. దీనిపై గతంలో విచారణ జరిపిన న్యా యస్థానం, తీర్పు వెలువరించే వరకు ఫలితాలను వెల్లడించవద్దని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై మరోసారి జస్టిస్‌ మాధవీదేవి విచారణ చేపట్టి.. తీర్పు వెలువరించారు. పరీక్షను పకడ్బందీగా నిర్వహించలేదని భావించిన న్యాయమూర్తి.. రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)