Breaking News

రుణమాఫీపై వారంలో కేబినెట్‌    

Published on Thu, 06/13/2024 - 05:10

సాక్షి, హైదరాబాద్‌: రైతు రుణమాఫీ అమలు చేసే దిశగా ప్రభుత్వం కార్యాచరణను ముమ్మరం చేసింది. ఆగస్టు 15వ తేదీలోగా రైతులకు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రుణమాఫీపై చర్చించేందుకు, విధివిధానాలు ఖరారు చేసేందుకు వారం రోజుల్లో రాష్ట్ర కేబినెట్‌ సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. 

ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసేందుకు అవసరమైన ప్రభుత్వ పరమైన నిర్ణయాలపై ఈ సమావేశంలో చర్చిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. రైతులకు ఇచి్చన హామీ ప్రకారం గడువులోగా రుణమాఫీకి సన్నాహాలు చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి.. వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. 

ఈ నేపథ్యంలో రుణమాఫీకి ఎన్ని నిధులు అవసరం, దానికి తగ్గట్లుగా నిధుల సమీకరణకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు, అందుబాటులో ఉన్న వనరులను పరిశీలిస్తున్నారు.  

కటాఫ్‌ తేదీ ఏది? 
మరోవైపు రుణమాఫీ అమలుకు ఏ తేదీని కటాఫ్‌గా తీసుకోవాలి, అర్హులైన రైతులందరికీ లబ్ధి చేకూరేలా విధివిధానాలు ఎలా ఉండాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. గతంలో జరిగిన రుణమాఫీ అమలు తీరును పరిశీలించటంతో పాటు ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీ పథకాలు, వాటి అమలుకు అనుసరించిన పద్ధతిని సంబంధిత శాఖల అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు, వాటి ప్రయోజనాలు, అనుసరిస్తున్న విధివిధానాలు, నిర్దేశించిన అర్హతలను కూడా పరిశీలిస్తున్నారు.  

కేంద్రం మాదిరి ఉద్యోగులు, డాక్టర్లు తదితరులకు మినహాయింపు? 
కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం కిసాన్‌) పథకంలో భాగంగా దేశంలో అర్హులైన రైతులందరికీ ప్రతి ఏడాది రూ.6 వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ చైర్మన్లు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు, కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు, రూ.10 వేలకు మించి పెన్షన్‌ అందుకునే రిటైర్డ్‌ ఉద్యోగులు, ఐటీ పన్ను చెల్లించేవారు, డాక్టర్లు, ఇంజనీర్లు, సీఏ, ఆర్కిటెక్టులు లాంటి ప్రొఫెషనల్స్‌ను ఈ పథకం నుంచి మినహాయించింది. 

పీఎం కిసాన్‌ పథకానికి కేంద్రం అనుసరించిన మార్గదర్శకాలు అసలైన రైతులకు లబ్ధి చేకూర్చాయనే అభిప్రాయం ఉంది. ఈ మేరకు రుణమాఫీ అమలుకు ఎటువంటి మార్గదర్శకాలు పాటించాలి, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి రైతుకు మేలు జరిగేలా ఎలాంటి విధివిధానాలుండాలనేది రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)