Breaking News

బస్సు కండక్టర్‌ టికెట్‌ మెషీన్‌నే కొట్టేశాడు!

Published on Thu, 03/06/2025 - 07:42

మలక్‌పేట(హైదరాబాద్‌): ప్లాట్‌ఫాంపై ఆగి ఉన్న బస్సులోని కండక్టర్‌ టికెట్‌ మెషీన్‌ను గుర్తు తెలియని వ్యక్తి కొట్టేశాడు. మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో సూర్యాపేట డిపో బస్సు నగరానికి చేరుకుంది. తిరిగి సూర్యాపేటకు వెళ్లే క్రమంలో దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాండ్‌లోని 2 నంబర్‌ ప్లాట్‌ఫాంపై డ్రైవర్‌ బస్సు ఆపాడు. 

కండక్టర్‌ కృష్ణవేణి టికెట్‌ మెషీన్‌ తన బ్యాగులో పెట్టి కంట్రోలర్‌ వద్ద వెళ్లి వచ్చి చూసేసరికి కన్పించలేదు. బ్యాగులో టికెట్‌ మెషీన్, సెల్‌ఫోన్, పాస్‌బుక్‌ ఉన్నట్లు పోలీసులకు కండక్టర్‌ ఫిర్యాదు చేశారు. కండక్టర్‌ బస్సు దిగిన తర్వాత డ్రైవర్‌ కార్గో కేంద్రానికి వెళ్లడంతో ఇదే అదనుగా భావించిన ఆగంతకుడు బ్యాగును అపహరించాడు. ఇందంతా మూడు నిమిషాల్లోనే జరిగిందని కండక్టర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు కేసు   దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్‌లాల్‌ తెలిపారు. సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.  

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)