Breaking News

వలస కార్మికులకు బంపర్‌ ఆఫర్‌

Published on Sat, 12/02/2023 - 01:05

మోర్తాడ్‌(బాల్కొండ): రాష్ట్రంలోని వలస కార్మికులకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)లో ఉపాధి కల్పించడానికి ఏడీఎన్‌హెచ్‌ కంపాస్‌ కంపెనీ ఉచిత రిక్రూటింగ్‌ ప్రక్రియ చేపట్టింది. తెలంగాణ జిల్లాలకు చెందిన 12 వేలమంది వలస కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న కంపెనీ మరి కొంతమంది కార్మికులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. క్యాటరింగ్‌ రంగంలో వలస కార్మికులకు ఆరు రకాలైన పనులు కల్పించనున్నారు.

ఉచితంగా వీసా, విమాన టికెట్‌ సౌకర్యాన్ని కంపెనీ కల్పిస్తుంది. క్యాటరింగ్‌ సూపర్‌వైజర్‌(హాస్పిటాలిటీ క్యాటరింగ్‌ అనుభవం ఉన్నవారికి), టీం లీడర్‌(హాస్టల్‌ నిర్వహణ అనుభవం), హెవీ వెహికల్‌ డ్రైవర్‌(యూఏఈ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నవారికి), కిచెన్‌ స్టీవార్డ్స్, క్లీనర్స్, వెయిటర్‌లకు ఉపాధి కల్పించడానికి వీసాలను జారీ చేయనున్నారు. ఈ నెల 9న ముంబైలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.

ఈ నెల 5, 6 తేదీల్లో ఆర్మూర్, జగిత్యాల్‌లోని జీటీఎం ఇంటర్నేషనల్‌ రిక్రూటింగ్‌ ఏజెన్సీవారిని కలిసి వివరాలను అందించాలని సంస్థ యజమాని చీటి సతీశ్‌రావు ‘సాక్షి’కి వివరించారు. 22 నుంచి 35 ఏళ్లలోపు వయసు కలవారు ఈసీఎన్‌ఆర్‌ పాస్‌పోర్టు కలిగి ఉండాలన్నారు. అభ్యర్థులకు పచ్చ»ొట్టు ఉండకూడదని చెప్పారు. వేతనంతోపాటు ఉచితవసతి, భోజన సదుపాయం కల్పించి ఉపాధి ఇవ్వనున్నారని వెల్లడించారు. ముంబైలో ఇంటర్వ్యూకు వెళ్లేవారి కోసం తక్కువ ఖర్చుతో బస్సు సౌకర్యం కల్పించామన్నారు. 

Videos

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)