Breaking News

జీహెచ్‌ఎంసీలో త‌గ్గిన భ‌వ‌న నిర్మాణ అనుమ‌తులు

Published on Thu, 04/03/2025 - 20:46

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలో భవన నిర్మాణ అనుమతులు కొంత తగ్గుముఖం పట్టాయి. గత ఆర్థిక సంవత్సరంలో 13,641 భవన నిర్మాణాలకు అనుమతులివ్వగా, తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరం (2024–25)లో అవి 13,421కి తగ్గాయి. అయినప్పటికీ  ఆదాయం మాత్రం కొంత పెరిగింది.  క్రితంసారి రూ.1107.29 కోట్ల ఆదాయం రాగా, ఈసారి రూ.1138.44 కోట్ల ఆదాయం సమకూరింది.  

హై రైజ్‌ భవనాలు (High-rise buildings) సైతం క్రితం కంటే తగ్గాయి. క్రితంసారి 130 హై రైజ్‌ భవనాలకు అనుమతులు జారీ కాగా.. ఈసారి 102 హై రైజ్‌ భవనాలకు మాత్రమే అనుమతులు జారీ అయ్యాయి. హై రైజ్‌ భవనాల్లో ఇనిస్టిట్యూషనల్‌ భవనాలు, ఆస్పత్రుల వంటివి మాత్రం గతం కంటే ఈసారి పెరిగాయి. గతంలో అలాంటివి కేవలం 12 మాత్రం ఉండగా, ఈసారి 46కు పెరిగాయి. దీంతో ఆదాయం (income) పెరిగింది.  

50 అంతస్తుల భవంతికి అనుమతి 
తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కొండాపూర్‌లో జీ+49 అంతస్తులతో 50 అంతస్తుల నివాస  భవనానికి అనుమతులు జారీచేశారు. 165.95 మీటర్ల ఎత్తుతో 8 టవర్లుగా ఈ నిర్మాణానికి అనుమతులు జారీ అయినట్లు జీహెచ్‌ఎంసీ పేర్కొంది.  

నేటి నుంచి ‘బిల్డ్‌ నౌ’’ 
జీహెచ్‌ఎంసీ పరిధిలో భవన నిర్మాణ అనుమతుల్ని మరింత సరళీకరించేందుకు అందుబాటులోకి తెచ్చిన ఏఐ ఆధారిత ‘బిల్డ్‌ నౌ’ (BuildNow) పోర్టల్‌ ద్వారానే కొత్త దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చీఫ్‌ సిటీ ప్లానర్‌ కె. శ్రీనివాస్‌ తెలిపారు. భవన నిర్మాణాలకు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారంతా ‘బిల్డ్‌ నౌ’లోనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇటీవలే దీన్ని సీఎం రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించడం తెలిసిందే. 

  

వ్యక్తిగత నివాస భవనాలు 75 చదరపుగజాల్లోపు ఇళ్లకు ఇన్‌స్టంట్‌ రిజిస్ట్రేష‌న్‌, పదిమీటర్ల లోపు ఎత్తు, 500 చదరపు గజాల్లోపు వాటికి ఇన్‌స్టంట్‌ అప్రూవల్‌ ఇస్తారు. అంతకు మించిన వాటికి సింగిల్‌విండో ద్వారా అనుమతులు జారీ చేస్తారు. 

చ‌ద‌వండి: యువ ఐఏఎస్ అధికారికి ఫ్యూచ‌ర్ సిటీ ప‌గ్గాలు!  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)