Breaking News

ప్రభుత్వ ఉపాధ్యాయుడి దారుణ హత్య

Published on Thu, 08/24/2023 - 13:48

ఖమ్మం: పాఠశాలకు వెళుతున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని గుర్తు తెలియని దుండగులు అడ్డగించి గొడ్డళ్లతో మెడపై నరికి హత్య చేసిన ఘటన కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మారోజు వెంకటాచారి (49) సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురం ప్రభుత్వ పాఠశాలలో పీఈటీగా విధులు నిర్వహిస్తున్నాడు. నాయకన్‌గూడెం నుంచి పాఠశాలకు బైక్‌పై వెళుతూ హత్యకు గురయ్యాడు. 

కారుతో బైక్‌ను ఢీకొట్టి.. 
వెంకటచారి బైక్‌ పై వెళుతుండగా నాయకన్‌గగూడెం శివారులో కారులో వచ్చిన గుర్తు తెలియని దుండగులు వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టారు. దీంతో వెంకటాచారి కిందపడగా కారులోని వారితో పాటు ద్విచక్ర వాహనంపై వచ్చిన మరో వ్యక్తి అతని మెడపై గొడ్డలితో నరికి పరారైనట్లు స్థానిక రైతులు తెలిపారు. ఎరుపు రంగు కారు, దాని వెనకే బైక్‌ రావడం సీసీ పుటేజీల్లోనూ కనిపించడంతో వారే హత్య చేసి ఉంటారని పోలీసులు కూడా చెబుతున్నారు.

అయితే హత్యకు గల కారణాలు తెలియలేదు. వెంకటాచారి రెండేళ్ల క్రితం నాయకన్‌గూడెంలో ఓ ప్రైవేటు పాఠశాలను నిర్వహించగా దాన్ని  ప్రస్తుతం నడపటం లేదు. ఆ భవనాలను గురుకుల పాఠశాలకు అద్దెకు ఇచ్చాడు. దీంతో ఆర్థిక కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఖమ్మంరూరల్‌ ఏసీపీ బస్వారెడ్డి, సీఐ జితేందర్‌రెడ్డి , ఎస్పై రమేష్‌కుమార్‌ పరిశీలించారు. ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలు లభించలేదని, దుండగులు పరారు కావడంతో  ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టామని సీఐ తెలిపారు. వెంకటాచారి కుటుంబసభ్యులు కూడా ఎవరిపై అనుమానాలు వ్యక్తం చేయలేదన్నారు.  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)