Breaking News

ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్‌ఎస్‌ దూరం

Published on Tue, 09/09/2025 - 04:38

సాక్షి, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉండా­లని బీఆర్‌ఎస్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. రైతుల సమస్యలు, ముఖ్యంగా యూరియా కొరతను పరిష్క­రిం­చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫల­మయ్యాయని ఆరోపిస్తూ, నిరసన రూపంలో ఈ నిర్ణ­యం తీసుకున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్‌ సురేశ్‌రెడ్డి సోమవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో పార్టీ వైఖరిని స్పష్టం చేశారు.

పార్టీ అధినేత కేసీఆర్‌తో చర్చించిన మీదటే మంగళవారం జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ‘యూరియా సమస్యను పరిష్కరించాలని మేము కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పలుమార్లు కోరాం. కానీ, రెండు ప్రభుత్వా లూ రైతుల గోడును పట్టించుకోకుండా పూర్తిగా విఫలమయ్యాయి. ప్రభు­త్వాల ఈ రైతు వ్యతిరేక వైఖరికి నిరసన తెలిపేందుకే ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించాం’అని సురేశ్‌రెడ్డి చెప్పారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక బ్యాలెట్‌పై నోటాకు అవకాశం లేనందున, తమ నిరసనను తెలిపేందుకు ఎన్నికకు దూరంగా ఉండటమే సరైన మార్గమని భావించామన్నారు.  

అభ్యర్థులను గౌరవిస్తాం...కానీ రైతుల సమస్యే ముఖ్యం  
‘పోటీలో ఉన్న ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డిలను మేము గౌరవిస్తాం. సుదర్శన్‌రెడ్డి మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అయినా, రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్న ప్రస్తుత తరుణంలో మా నిరసనను బలంగా వినిపించడమే మా కర్తవ్యం’అని సురేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను వేధిస్తోందని, ఇలాంటి పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకొని పార్టీ అధినేత కేసీఆర్‌తో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)