Breaking News

కోమటిరెడ్డి నల్లగొండ పర్యటనలో ఉద్రిక్తత

Published on Thu, 02/16/2023 - 17:52

సాక్షి, నల్లగొండ:  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గురువారం ఆయన జిల్లాలోని శాలిగౌరారం మండలంలోని ఇటుకలపాడులో పర్యటించారు. అయితే.. 

ఈ పర్యటనలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.  బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని హాజరైన కోమటిరెడ్డి ప్రసంగించారు. రోడ్లు బాగోలేవని, ఇటుకలపాడుకు రావడానికి మూడు గంటలకు పైగా సమయం పట్టిందని.. సీఎం కేసీఆర్‌పై ఆయన విమర్శలు గుప్పించారు. అయితే.. 

ఆ వ్యాఖ్యలు అక్కడే ఉన్న కొందరు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించాయి. బొడ్రాయి ప్రతిష్టాపనకు వచ్చి రాజకీయం మాట్లాడుతున్నారంటూ అడ్డుకునే యత్నం చేశారు. ఈ క్రమంలో ఆయనపై కుర్చీలు, కర్రలు విసిరి దాడి చేసేందుకు యత్నించారు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు. అయితే దాడి నుంచి ఆయన తప్పించున్నారు. ఈ క్రమంలో..

పోటీగా రంగంలోకి కాంగ్రెస్‌ కార్యకర్తలు.. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో తోపులాటకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారగా.. పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నించారు.

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)