పోలీస్‌ విచారణకు హాజరైన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి

Published on Fri, 01/17/2025 - 10:36

హైదరాబాద్‌, సాక్షి: హుజూరాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి పోలీస్‌ విచారణ ముగిసింది.  పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో మాసబ్‌ ట్యాంక్‌ సీఐ ఎదుట ఆయన విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అరగంటకుపైగా ఆయన్ని విచారణ జరిపినట్లు తెలుస్తోంది.  

డిసెంబర్ 4వ తేదీన కౌశిక్‌ రెడ్డి తన అనుచరులతో కలిసి బంజారాహిల్స్‌(Banjara Hills) పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. తన ఫోన్ ట్యాప్ అవుతోందంటూ ఆయన ఫిర్యాదు చేయబోయారు. అయితే ఆ సమయంలో బంజారాహిల్స్ ఇన్స్‌పెక్టర్ రాఘవేందర్ బయటకు వెళ్తున్నారు. దీంతో.. సీఐ వాహనానికి తన వాహనాన్ని అడ్డు పెట్టి కౌశిక్ రెడ్డి హల్‌చల్ చేశారు. ఈ ఘటనపై సీఐ రాఘవేందర్‌ ఫిర్యాదు చేశారు. దీంతో.. 

పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పాడి కౌశిక్‌ రెడ్డి(Padi Kaushik Reddy)పై కేసు నమోదు అయ్యింది. అయితే ఫిర్యాదుదారుడు సీఐ కావడం, అది బంజారాహిల్స్‌ పీఎస్‌లోనే కావడంతో.. దర్యాప్తు అధికారిగా మాసబ్ ట్యాంక్ సీఐ పరుశురాంను ఉన్నతాధికారులు నియమించారు.  ఈ కేసుకు సంబంధించి తాజాగా కౌశిక్‌కు నోటీసులు వెళ్లాయి. ఈ క్రమంలోనే ఇవాళ విచారణకు హాజరయ్యారు. 

నా తప్పేమీ లేదు: కౌశిక్‌రెడ్డి
మాసబ్‌ ట్యాంక్‌ పీఎస్‌ లోపలికి వెళ్లే క్రమంలో కౌశిక్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘నేను చేసిన తప్పేమీ లేదు. విచారణకు పూర్థిస్తాయిలో సహకరిస్తా’’ అన్నారు. అయితే తన అడ్వొకేట్‌(Advocate)తో కలిసి ఆయన లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా సిబ్బంది అడ్డుకున్నారు. ఆపై ఆయన విజ్ఞప్తితో ఉన్నతాధికారులను సంప్రదించి.. అనంతరం వాళ్లను లోపలికి వెళ్లనిచ్చారు. 

Videos

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)