Breaking News

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల వివాదం..‘సుప్రీం’ తుది తీర్పు అప్పుడే!

Published on Mon, 12/09/2024 - 15:56

సాక్షి,ఢిల్లీ: గవర్నర్‌కోటా ఎమ్మెల్సీల వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ నేత దాసోజు శ్రవణ్ వేసిన పిటిషన్‌పై సోమవారం(డిసెంబర్‌ 9) విచారణ జరిగింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను దాసోజు శ్రవణ్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ప్రసన్నలతో కూడిన ధర్మాసనం కేసు విచారించింది.తదుపరి విచారణను ఫిబ్రవరి 12కు కోర్టు వాయిదా వేసింది. 

ఆ రోజు తుది వాదనలు వినడంతో పాటు ఫైనల్ ఆర్డర్ ఉంటుందని తెలిపింది. దాసోజు శ్రవణ్‌ తరపున సుప్రీంకోర్టులో  సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టు ఈ కేసులో స్టే ఇచ్చినప్పటికీ, కోర్టు ఆదేశాలను  ధిక్కరిస్తూ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం జరిగిందని సుప్రీంకోర్టు దృష్టికి ముకుల్ రోహిత్గి తీసుకువచ్చారు.

కాగా, గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం  దాసోజు శ్రవణ్‌ను నామినేట్‌ చేసినప్పటికీ అప్పటి గవర్నర్‌ తమిళిసై ఆమోదించకపోవడంతో ఆయన ఎమ్మెల్సీ కాలేకపోయారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీజేఎస్‌ చీఫ్‌ కోదండరాం సహా ఇతరులను పెద్దల సభకు పంపించింది.దీంతో శ్రవణ్‌ తన న్యాయపోరాటాన్ని కొనసాగిస్తున్నారు.

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)