Breaking News

కాళేశ్వరంపై బీఆర్‌ఎస్‌ పోరుబాట

Published on Wed, 06/18/2025 - 05:20

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్‌ను మరమ్మతు చేసి పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తున్న బీఆర్‌ఎస్‌.. ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని ఎండగట్టాలని నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవ స్థితిగతులను ప్రజలకు వివరించేందుకు ఈ నెల 21న పోరుబాట చేపట్టనుంది. మేడిగడ్డలోని రెండు పిల్లర్ల కుంగుబాటును చూపుతూ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగమైందంటూ వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు సన్నద్ధమవుతోంది. పోరుబాట కార్యక్రమంలో భాగంగా పార్టీ నేతలు స్థానిక రైతులతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న బరాజ్‌లు, పంపింగ్‌ స్టేషన్లు, రిజర్వాయర్లను సందర్శిస్తారు.

పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ లండన్‌ పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్‌రావు ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. గోదావరి–బనకచర్ల లింక్‌ ప్రాజెక్టును అడ్డుకోవడంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, ఆ పార్టీల వైఖరిని ఎండగట్టేందుకు మరో నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. వచ్చే నెలలో బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర బంద్‌ లేదా సడక్‌ బంద్‌ చేపట్టాలని బీఆర్‌ఎస్‌ యోచిస్తోంది. దీనిపై ఈ నెలాఖరులోగా కార్యాచరణ ప్రకటించే అవకాశమున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి.

నేడు లండన్‌కు కేటీఆర్‌
ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఆక్స్‌ఫర్డ్‌ ఇండియా ఫోరమ్‌ ఆధ్వర్యంలో ఈ నెల 20, 21 తేదీల్లో జరిగే రెండు రోజుల సదస్సులో కేటీఆర్‌ పాల్గొంటారు. ఈ సదస్సులో ‘ఫ్రాంటియర్‌ టెక్నాలజీస్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ ఇండియా’ అనే అంశంపై కేటీఆర్‌ కీలకోపన్యాసం చేస్తారు. దేశ ప్రగతి, తెలంగాణలో అమలు చేసిన వినూత్న విధానాలు, టెక్నాలజీ తదితరాలపై చర్చిస్తారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు బుధవారం రాత్రి కేటీఆర్‌ లండన్‌కు బయలుదేరనున్నారు. ఈ నెల 24న హైదరాబాద్‌కు తిరిగి వస్తారని బీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి.

కాగా వైద్య పరీక్షల కోసం నందినగర్‌ నివాసానికి వచ్చిన పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌ మరో రెండు రోజులపాటు ఇక్కడే బస చేయనున్నారు. ఇక్కడే పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్‌ భేటీ అయ్యి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల అమెరికాలోని డాలస్‌లో బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ నిర్వహణలో క్రియాశీలంగా పనిచేసిన బీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ విభాగం సమన్వయకర్త మహేశ్‌ బిగాలా మంగళవారం కేసీఆర్‌ను కలిశారు. డాలస్‌ సభను విజయవంతంగా నిర్వహించిన పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగం నేతలను కేసీఆర్‌ అభినందించారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)