Breaking News

ఎన్నికలే ఎజెండా..

Published on Fri, 09/26/2025 - 01:02

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పార్టీ నేతలతో కీలక భేటీ నిర్వహించారు. ఎర్రవల్లి నివాసంలో గురువారం జరిగిన ఈ భేటీలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. 

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కోసం కేడర్‌తో జరుగుతున్న సమావేశాల వివరాలను కేటీఆర్‌ వివరించారు. పోలింగ్‌ బూత్‌ స్థాయిలో ప్రతి ఓటర్‌ను చేరుకునేలా పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాలని కేసీఆర్‌ ఆదేశించారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి రిజర్వాయర్‌ ఎత్తు పెంపుతో కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగే నష్టం గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. 

బనకచర్ల లింకు ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభు త్వం అనుసరిస్తున్న వైఖరితో రాష్ట్రానికి జరిగే నష్టంపై బీఆర్‌ఎస్‌ పోరాడక తప్పదని కేసీఆర్‌ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై సీబీఐ ప్రాథమిక సమాచార సేకరణ ప్రారంభించిందనే వార్తల నేపథ్యంలో పీసీ ఘోష్‌ కమిషన్‌ ఎదుట వాదన వినిపించిన తరహాలోనే ముందుకు వెళ్లాలని  కేసీఆర్‌ నిర్ణయించినట్లు తెలిసింది. 

స్థానిక ఎన్నికలపై టెలి కాన్ఫరెన్స్‌ 
రేపోమాపో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ వెలువడుతుందనే వార్తల నేపథ్యంలో కేటీఆర్, హరీశ్‌రావు గురువారం పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎరువుల కొరత మొదలుకుని బతుకమ్మ పండుగ ఏర్పాట్ల వరకు ప్రభుత్వం అన్ని అంశాల్లోనూ విఫలమైందని కేటీఆర్‌ విమర్శించారు. స్థానిక ఎన్నికలను సవాల్‌గా తీసుకుని ప్రజల్లోకి వెళ్లాలని, ఊరూరా పార్టీ ఆధ్వ ర్యంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించాలని కేటీఆర్‌ ఆదేశించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)