Breaking News

ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో గోల్‌ మాల్‌.. రాకేష్‌ రెడ్డి సీరియస్‌

Published on Thu, 06/06/2024 - 18:42

సాక్షి, నల్లగొండ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్‌ తీరుపై బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి రాకేష్‌ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియలో గోల్‌మాల్‌ జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు కౌంటింగ్‌ కేంద్రం వద్ద గురువారం ఆయన మాట్లాడుతూ.. మూడో రౌండ్‌లో కాంగ్రెస్‌కు మూడు వేలు ఆధిక్యం వస్తే నాలుగు వేలకు పైగా ఆధిక్యం వచ్చినట్లు ప్రకటించారని ఆరోపించారు. తాము అభ్యంతరం చెప్పినా ఆర్వో పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మూడో రౌండ్ నుంచి అనుమానం ఉందని చెప్పినా కనీస స్పందన లేదని దుయ్యబట్టారు.

ఎన్నికల ఫలితాలు తారుమారు చేస్తే కౌంటింగ్ బైకాట్ చేస్తామని చెప్పారు రాకేష్‌ రెడ్డి. దీనిపై ఎన్నికల సంఘం స్పందించాలని కోరారు. రిటర్నింగ్ అధికారిపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అధికారుల తీరు ఫలితాలను తారుమారు చేసేలా ఉందన్నారు. తమ అభ్యంతరాలకు వివరణ ఇచ్చాకే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కంపు జరపాలని డిమాండ్‌ చేశారు.

ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. తాజాగా మూడో రౌండ్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. మూడో రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్( తీన్మార్ మల్లన్న) లీడ్‌లో ఉన్నారు. ఆయనకు ఈ రౌండ్‌లో 4207 ఓట్ల ఆధిక్యత లభించింది.

మూడు రౌండ్లు ముగిసే సమయానికి కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్( తీన్మార్ మల్లన్న కాంగ్రెస్) 1,06,234.. రాకేష్ రెడ్డి (బీఆర్ఎస్) 87,356.. ప్రేమేందర్ రెడ్డి( బీజేపీ) 34,516.. అశోక్ (స్వతంత్ర) 27,493 ఓట్లు పడ్డాయి.  చెల్లిన ఓట్లు 2,64,216 కాగా చెల్లని ఓట్లు 15784గా ఉన్నాయి. ప్రస్తుతానికి తీన్మార్‌ మల్లన్న 18878 ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకు 2 లక్షల 88 వేల ఓట్ల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి చేయగా. మరో 48013 ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు.

Videos

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)