Breaking News

టీబీజీకేఎస్‌ ఇన్‌చార్జిగా కొప్పుల

Published on Thu, 07/17/2025 - 04:02

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ బొగ్గుగని కార్మీక సంఘం (టీబీజీకేఎస్‌) కార్యకలాపాలను ఇకపై సంఘం వ్యవస్థాపక సభ్యుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పార్టీ పక్షాన ఇన్‌చార్జిగా పర్యవేక్షిస్తారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు. సింగరేణి ప్రాంతానికి చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు, మాజీ మంత్రులతో సమన్వయం చేసుకుంటూ బొగ్గు గని కార్మిక సంఘం కార్యకలాపాలు నిర్వహించాలన్నారు. తెలంగాణ భవన్‌లో బుధవారం టీబీజీకేఎస్‌ నేతలతో జరిగిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. కొప్పుల ఆధ్వర్యంలో సంఘం కార్యకలాపాలను ముందుకు తీసుకుపోవడంతోపాటు కార్మీకుల సమస్యలపై పోరాటం చేయాలన్నారు.

సింగరేణి బొగ్గు గనులపై కాంగ్రెస్, బీజేపీ కలిసి చేస్తున్న కుట్రలపై గళమెత్తాలని పిలుపునిచ్చారు. పార్టీకి అనుబంధంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ద్వారా సింగరేణి కార్మీకుల హక్కుల కోసం ఉద్యమించాలన్నారు. సింగరేణి కార్మికులకు కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేంత వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఈ భేటీలో నిర్ణయించారు. కార్మీకులకు ప్రభుత్వం చేసే అన్యాయాలపై పోరాడేందుకు పార్టీ లీగల్‌ సెల్‌ అండగా ఉంటుందని కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. బొగ్గు గని కార్మీక సంఘం ఆధ్వర్యంలో త్వరలో విస్తృతస్థాయి సమావేశం ఉంటుందని ప్రకటించారు.  

‘టాక్‌ జర్నలిజం’ఈవెంట్‌కు కేటీఆర్‌ 
దేశంలోని ప్రముఖ జర్నలిస్టులు, మేధావులు, రాజకీయ నాయకులు ప్రతిష్టాత్మక ‘టాక్‌ జర్నలిజం 2025’కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కేటీఆర్‌కు ఆహ్వనం అందింది. ఈ నెల 19, 20 తేదీల్లో రాజస్తాన్‌లోని జైపూర్‌ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది. దక్షిణ భారత రాజకీయాల్లో ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని బలంగా వినిపిస్తున్న, విజన్‌ ఉన్న వినూత్న నాయకుడిగా పేరు తెచ్చుకున్న కేటీఆర్‌ను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు ఆహ్వన లేఖలో పేర్కొన్నారు.

మీడియా రంగంలోని మార్పులు, ధోరణులు, సవాళ్లపై చర్చించేందుకు దేశ విదేశాలకు చెందిన జర్నలిస్టులు కలుసుకునే వేదికగా ‘టాక్‌ జర్నలిజం’నిలుస్తోంది. గతంలో సచిన్‌ పైలట్, అసదుద్దీన్‌ ఒవైసీ, సుబ్రమణ్య స్వామి, జీవీఎల్‌ నరసింహారావు, రాఘవ్‌ చద్దా, డి.రాజా, ప్రియాంకా చతుర్వేది తదితరులు పాల్గొన్నారు. ఈసారి కేటీఆర్‌ తన ప్రసంగంలో ప్రాంతీయ అసమానతలు, సమాఖ్య విధానం, మారుతున్న భారత రాజకీయాల దిశ వంటి అంశాలను ప్రస్తావించనున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)