Breaking News

ప్రీమెట్రిక్‌ ఉపకార దరఖాస్తులకు బ్రేక్‌

Published on Fri, 01/30/2026 - 04:41

సాక్షి, హైదరాబాద్‌: ప్రీమెట్రిక్‌ విద్యార్థుల ఉపకార దరఖాస్తు ప్రక్రియలో బీసీ విద్యార్థులకు ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగిస్తున్న సంక్షేమ శాఖలు... బీసీ విద్యార్థులకు మాత్రం దరఖాస్తు ప్రక్రియను నిలిపివేశాయి. ఎలాంటి ముందస్తు సమాచారం లేకపోవడం, కనీసం గడువు తేదీని సైతం ఖరారు చేయకుండా అర్ధంతరంగా దరఖాస్తు ప్రక్రియను ఆపేయడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

రాష్ట్రంలో 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉపకారవేతనాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించి... ఆన్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. విద్యార్థులకు దరఖాస్తుపై పెద్దగా అవగాహన ఉండదనే భావనతో పాఠశాల యాజమాన్యాలు.. టీచర్లకు సూచనలిస్తూ ఆయా పిల్లల దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 

ఇందులో భాగంగా ఈ–పాస్‌ వెబ్‌సైట్‌లో ప్రీమెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ ఆప్షన్‌ ద్వారా ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. ఈ దరఖాస్తుకు ఎలాంటి గడువు విధించలేదు. పోస్టుమెట్రిక్‌ విద్యార్థులకు మార్చి 31 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించగా... ప్రీమెట్రిక్‌ విద్యార్థులకు సైతం ఆమేరకు అవకాశం కల్పించనున్నట్లు అధికారులు మౌఖికంగా చెప్పుకొచ్చారు. దీంతో సంబంధిత పత్రాలు సిద్ధం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. 

అలా వివరాలు సిద్ధం చేసుకున్న విద్యార్థుల దరఖాస్తులను పాఠశాల యాజమాన్యాలు, టీచర్లు వీలుచిక్కినప్పుడు ఆన్‌లైన్‌లో సమర్పిస్తున్నారు. కొన్నిచోట్ల సమీప మీ సేవ కేంద్రాల్లో కూడా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకునేందుకు విద్యార్థులకు సమయం పడుతుండటంతో సిద్ధం చేసుకున్న విద్యార్థుల దరఖాస్తులను ఎప్పటికప్పుడు సమర్పించారు. అయితే, ఇంకా పత్రాలు సిద్ధం చేసుకోని వారి దరఖాస్తు ప్రక్రియ పెండింగ్‌లో ఉండిపోయింది. 

ఇంతలో బీసీ సంక్షేమ శాఖ దరఖాస్తుల స్వీకరణను వారం రోజుల క్రితం నిలిపివేసింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల దరఖాస్తులు కొనసాగుతున్నప్పటికీ... బీసీ విద్యార్థుల దరఖాస్తు ప్రక్రియ నిలిపివేయడంపై బీసీ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విద్యార్థులు మూడు రోజులుగా బీసీ సంక్షేమ శాఖ క్షేత్రస్థాయి కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దరఖాస్తుకు అవకాశం కల్పించాలని వినతులు సమర్పిస్తున్నారు. ఈ అంశాన్ని ఉన్నతాధికారులకు విన్నవిస్తామని బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారులు చెప్పారు.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)