Breaking News

ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి బ్రేక్‌!

Published on Sat, 08/05/2023 - 05:29

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు బ్రేక్‌ పడింది. వారికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు కల్పించేందుకు టీఎస్‌ఆర్టీసీ చట్ట సవరణ ముసాయిదా బిల్లు–2023ను రూపొందించిన ప్రభుత్వం.. దాని ని శాసనసభలో ప్రవేశపెట్టడానికి గవర్నర్‌ తమిళిసై అనుమతి కోరుతూ రాజ్‌భవన్‌కు పంపింది. కానీ గవర్నర్‌ దీనికి అనుమతి ఇవ్వకపోవడంతో.. చట్టరూపంలోకి రాని బిల్లుల జాబితాలో చేరిపోయింది. 

రేపటితో అసెంబ్లీ ముగుస్తుండటంతో.. 
ప్రస్తుత శాసనసభ సమావేశాల్లోనే ఆర్టీసీ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడం ద్వారా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు కల్పించాలని ఇటీవలి కేబినెట్‌ భేటీలో సీఎం కేసీఆర్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆదివారంతో రాష్ట్ర శాసనసభ సమావేశాలు ముగుస్తున్నాయి. ఆలోగా బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్‌ అనుమతి లభించడం అనుమానమేనని అభిప్రా యం వ్యక్తమవుతోంది. దీంతో 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులు నైరాశ్యంలో మునిగిపోయారు.

ఇదే తొలిసారి 
ద్రవ్య వినిమయం (బడ్జెట్‌), కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలోని అంశాలకు సంబంధించిన బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టడానికి ముందే గవర్నర్‌ అనుమతి తప్పనిసరి. ఇక శాసనసభ పాస్‌ చేసిన ఏ బిల్లునైనా గవర్నర్‌ ఆమోదానికి రాజ్‌భవన్‌కు పంపాలి. ఆపై బిల్లులు చట్టరూపం దాల్చి అమల్లోకి వస్తాయి. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసుకోనుండటంతో వారికి ప్రతినెలా జీతభత్యాలను ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది.

ఇది ఆర్థికపరమైన వ్యవహారం కావడంతో ప్రభుత్వం ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ముందే గవర్నర్‌ అనుమతికి పంపాల్సి వచ్చింది. అయితే గతంలో కూడా.. ఇలాంటి బిల్లుల ను సభలో ప్రవేశపెట్టడానికి ముందు గవర్నర్‌ అనుమతిని వాయిదా వేసిన/నిరాకరించిన సందర్భాలు లేవని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

ప్రభుత్వం వివరణ ఇస్తే నిర్ణయం! 
ఆర్టీసీ బిల్లుకు సంబంధించి రాజ్‌భవన్‌ శుక్రవారం మధ్యాహ్నం, అర్ధరాత్రి రెండు ప్రకటనలు విడుదల చేసింది. తొలుత ‘‘ఈ నెల 3న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా.. 2న మధ్యాహ్నం 3.30 గంటలకు ఆర్టీసీ చట్ట సవరణ బిల్లు–2023 ప్రతిపాదన రాజ్‌భవన్‌కు చేరింది. బిల్లు పరిశీలన, న్యాయ నిపుణుల సలహా తీసుకుని ప్రభుత్వ విజ్ఞప్తిపై నిర్ణయం తీసుకోవడానికి మరో కొంత సమయం అవసరం’’ అని పేర్కొంది.

రాత్రి విడుదల చేసిన ప్రకటనలో.. ‘‘ఆర్టీసీ బిల్లును గవర్నర్‌ పరిశీలించారు. సంస్థ, ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని.. పలు అంశాలపై వివరణలు, స్పష్టతను కోరుతూ ప్రభుత్వానికి వర్తమానం పంపించారు. ప్రభుత్వం తక్షణమే వివరణలతో బదులిస్తే.. బిల్లుపై గవర్నర్‌ నిర్ణయం తీసుకుంటారు’’ అని తెలిపింది. ఆర్టీసీ బిల్లుకు అనుమతి ఇవ్వకుంటే రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో గవర్నర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)