Breaking News

హైదరాబాద్‌లో విషాదం.. లిఫ్ట్‌లో ఇరుక్కుని బాలుడు మృతి

Published on Wed, 11/19/2025 - 22:30

సాక్షి, హైదరాబాద్‌: అప్పటిదాకా తన వెంటే ఉన్న కుమారుడు క్షణాల్లోనే విగతజీవిగా మారడంతో ఆ కన్నతల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. లిఫ్ట్‌లో ఇరుక్కుని ఐదేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన మధురానగర్‌ పరిధిలో విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం ప్రకారం.. బల్లి నర్సినాయుడు, ఐశ్వర్య దంపతులు ఎల్లారెడ్డిగూడలోని కీర్తి అపార్ట్‌మెంట్స్‌ జి–బ్లాక్‌లో  నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు చైత్విక్, హర్షవర్ధన్‌ ఉన్నారు.

మధురానగర్‌ కాలనీలోని శ్రీనిధి స్కూల్‌లో చైత్విక్‌ ఒకటో తరగతి, హర్షవర్ధన్‌ (5) యూకేజీ చదువుతున్నారు. బుధవారం సాయంత్రం తల్లి ఐశ్వర్య కుమారులను స్కూల్‌ నుంచి ఇంటికి తీసుకు వచ్చింది. కొద్ది సేపటి తర్వాత తల్లి, ఇద్దరు కుమారులు లిఫ్ట్‌లో పైఅంతస్తుకు వెళ్లారు. ఐశ్వర్య, పెద్ద కుమారుడు చైతి్వక్‌ లిఫ్ట్‌ దిగి జి–బ్లాక్‌లోని ఇంట్లోకి వెళ్లారు. హర్షవర్ధన్‌ మాత్రం లిఫ్ట్‌ దిగలేదు.

ఈ క్రమంలో లిఫ్ట్‌ ముందుభాగంలో ఏర్పాటు చేసి స్ప్రింగ్‌ డోర్‌ మూసుకుపోయింది. అంతలోనే లిఫ్ట్‌ ఒక్కసారిగా కదిలి కిందికి వెళ్లింది. స్ప్రింగ్‌ డోర్, ఇనుపగేట్లు మధ్య బాలుడు ఉన్నాడు. అలాగే నాలుగు, ఐదు అంతస్తుల మధ్యకు లిఫ్ట్‌ వచి్చంది. దీంతో హర్షవర్ధన్‌ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. లిఫ్ట్‌లో ఇరుక్కుపోవడంతో తొలుత పెద్దగా కేకలు వేశాడు. అనంతరం ఊపిరి ఆడక అచేతనంగా పడిపోయాడు.

తల్లి ఐశ్వర్య బయటికి  వచ్చి చూడగా హర్షవర్ధన్‌ రెండు అంతస్తుల మధ్య ఇరుక్కుని ఉన్నాడు. ఆమె కేకలు వేయడంతో సెక్యూరిటీ గార్డు, చుట్టుపక్కల వారు వచ్చి బాలుణ్ని అతికష్టమ్మీద బయటకు తీశారు. 108లో ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు బాలుడు హర్షవర్ధన్‌ మృతి చెందినట్టు నిర్ధారించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)