Breaking News

క్షణికావేశం.. యువ సర్పంచ్‌ జ్యోతి మృతి

Published on Tue, 07/14/2026 - 12:51

ఆదిలాబాద్‌: ఆమె ఒక గ్రామానికి సర్పంచ్‌. గ్రామంలోని ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతూ, ఎందరికో న్యాయం చేసింది. కానీ తన ఇంట్లో జరిగిన చిన్న గొడవకు క్షణికావేశంలో ప్రాణాలు తీసుకొని తన ఇద్దరు చిన్నారులకు తీవ్ర అన్యాయం చేసింది. ఇంట్లో జరిగిన చిన్నపాటి గొడవకు క్షణికావేశంలో బోరిగాం గ్రామానికి చెందిన సర్పంచ్‌ పల్లె జ్యోతి (25) ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై షేక్‌ జుబేర్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి జ్యోతి ఆమె భర్త విఠల్‌ల మధ్య పిల్లలను పాఠశాలకు పంపించే విషయమై చిన్నపాటి గొడవ జరిగింది.

 మనస్తాపానికి గురైన జ్యోతి అందరూ నిద్రిస్తున్న సమయంలో సోమవారం తెల్లవారుజామున వంట గదిలో చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచా రం అందించడంతో సీఐ రవీందర్‌ నాయక్, ఎస్సై షేక్‌ జుబేర్‌లు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. జ్యోతి తండ్రి మాదు ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్లు ఎస్సై వెల్లడించారు. ఆమెకు నాలుగేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. చిన్న పిల్లలు ఉన్నారన్న విషయాన్ని మరిచి తల్లి ప్రాణాలు తీసుకోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.  

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)