Breaking News

నేడు బోనమెత్తనున్న పాతబస్తీ

Published on Sun, 07/20/2025 - 08:02

చార్మినార్/చాంద్రాయణగుట్ట: నగరంతో పాటు పాతబస్తీలో ఆదివారం జరిగే ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బోనాల జాతర కోసం లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం సహా పాతబస్తీలోని ప్రధాన ఆలయాలన్నీ ముస్తాబయ్యాయి. కాగా.. లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి  ఆలయంలో తెల్లవారుజామున 4 గంటలకు బలిహరణ, అనంతరం ఉదయం 6 గంటలకు మాజీ ఎంపీ దేవేందర్‌ గౌడ్‌ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా మహాభిõÙకం ఉంటుంది. తదనంతరం బోనాల సమర్పణ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆలయ కమిటీ చైర్మన్‌ బి.మారుతీ యాదవ్‌ తెలిపారు.  రాత్రి 8 గంటలకు శాంతి కల్యాణం జరగనుంది. 

పట్టు వ్రస్తాలు సమర్పించనున్న మంత్రులు.. 
బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా అమ్మవార్లకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్‌బాబు తదితరులతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పట్టు వ్రస్తాలు సమరి్పంచనున్నారని ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు చైర్మన్‌ గోపిశెట్టి రాఘవేందర్‌ తెలిపారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఆలయాల పరిసరాల్లో బాంబు, డాగ్‌ స్క్వాడ్, నిఘా వర్గాలు భారీగా మోహరించాయి. దక్షిణ మండలం డీసీపీ స్నేహ మెహ్రా, అదనపు డీసీపీ మజీద్, ఛత్రినాక ఏసీపీ సి.హెచ్‌.చంద్రశేఖర్, ఇన్‌స్పెక్టర్‌ కె.ఎన్‌.ప్రసాద్‌ వర్మ లు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.  

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)