సికింద్రాబాద్‌-నాగ్‌పూర్‌ వందేభారత్‌కు బాంబు బెదిరింపు

Published on Mon, 10/07/2024 - 21:10

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌-నాగ్‌పూర్‌ వందేభారత్‌ రైలుకు బాంబు బెదిరింపు కాల్‌ రావడం కలకలం రేపింది. వందేభారత్‌లో బాంబు ఉందని ఓ ఆగంతుకుడు పోలీసులకు ఫోన్‌ చేసి చెప్పాడు. వెంటనే స్పందించిన పోలీసులు బాంబు, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీ చేశారు. 

అయితే రైలులో బాంబు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బాంబు ఉందని సమాచారంచ్చినక్తిని లింగంపల్లికి చెందిన ఐటీ ఉద్యోగి మధుసూదన్‌గా గుర్తించారు, దీంతో అతడిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.

కాగా సికింద్రాబాద్-నాగ్‌పూర్‌ మధ్య ఇటీవల వందే భారత్ ట్రైన్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 16న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ట్రైన్ ప్రారంభించగా.. సెప్టెంబర్ 19 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి ఈ కొత్త రైలు ఏర్పాటు చేశారు.

అయితే ఈ ట్రైన్ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి 80 శాతం ఖాళీతో నడుస్తోంది. ట్రైన్ మొత్తం సామర్థ్యం 1,440 కాగా.. దాదాపు 1200 సీట్లు ఖాళీగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వందే భారత్ ట్రైన్ బోగీల సంఖ్యను తగ్గించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ట్రైన్ 20 బోగీలతో నడుస్తుండగా.. 10 బోగీలకు పరిమితం చేయాలని భావిస్తున్నారు.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)