Breaking News

దుబాయ్‌ విమానానికి బాంబు బెదిరింపు

Published on Sat, 12/06/2025 - 06:06

శంషాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. దుబాయ్‌ నుంచి శుక్రవారం తెల్లవారు జామున 3.38 గంటలకు బయల్దేరిన ఫ్లైట్‌ మరో గంటలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయ్యే సమయంలో మెయిల్‌ వచ్చింది. ఉదయం 7.20 గంటలకు ఆర్‌జీఐఏ కస్టమర్‌ సపోర్ట్‌కు ల్యాండ్‌ కానున్న దుబాయ్‌ ఈకే–526 విమానం బాంబులతో పేల్చివేయనున్నట్లు హెచ్చరిక మెయిల్‌ అందింది. దీంతో అప్రమత్తమైన భద్రతాధికారులు వెంటనే బీటీఏసీ (బాంబ్‌ థ్రెట్‌ అసెస్‌ కమిటీ) ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

విమానం ఉదయం 8.38 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోనే సురక్షితంగా ల్యాండ్‌ అయింది. అయితే విమానాన్ని ప్రత్యేక బే వద్దకు తీసుకెళ్లి సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేశారు. ప్రయాణికులందరి లగేజీలతో పాటు ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించారు. అధికారులు ఆర్‌జీఐఏ ఔట్‌పోస్టులో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌కు బాంబు బెదిరింపు 
ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన మరో విమానానికి కూడా శుక్రవారం బాంబు బెదిరింపు ఈ మెయిల్‌ రావడంతో భద్రతాధికారులు ఉరుకులు పరుగులుపెట్టారు. ఆర్‌జీఐఏ కస్టమర్‌ సపోర్ట్‌కు రాత్రి 8 గంటలకు ఈ మెయిల్‌ రావడంతో భద్రతాధికారులు వెంటనే బాంబ్‌ థ్రెట్‌ అసెస్‌మెంట్‌ కమిటీ ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. 8.20 గంటలకు విమానం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోనే సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. అనంతరం విమానాన్ని ప్రత్యే బే వద్దకు తీసుకెళ్లి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)