Breaking News

రెండు రోజులుగా గదిలోనే మృతదేహాలు 

Published on Sun, 01/05/2025 - 08:28

అడ్డగుట్ట: కన్నతల్లి మృతిని తట్టుకోలేక ఓ కుమారుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన  లాలాగూడలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ రఘు బాబు తెలిపిన వివరాల ప్రకారం..  లాలాపేటలోని వినోభానగర్‌కు చెందిన లక్ష్మి (52), అభినయ్‌ (20) తల్లీకొడుకులు. వీరిద్దరు ఎనిమిదేళ్లుగా అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. లక్ష్మి కేన్సర్‌ పేషెంట్‌ కావడంతో ఇంట్లోనే ఉంటోంది. అభినయ్‌ డిగ్రీ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాడు. తల్లి మందుల ఖర్చు, కాలేజీ ఫీజు కోసం అభినయ్‌ ఏదో ఒక పని చేస్తుండేవాడు. 

శనివారం మధ్యాహ్నం వీరు నివాసముంటున్న ఇంట్లోంచి దుర్వాసన వస్తుండడంతో ఇంటి యజమాని బ్రహ్మాజీ సదరు తలుపులు ఎంత కొట్టినా  తెరవకపోవడంతో లాలాగూడ పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇంటి తలుపులు బద్దలుగొట్టి చూడగా హాల్‌లో అభినయ్‌ సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని విగతజీవిగా కనిపించాడు. లోపలికి వెళ్లి చూడగా బెడ్రూంలో తల్లి లక్ష్మి సైతం మృతి చెంది ఉంది. లక్ష్మీకి సంబంధించిన మెడికల్‌ రిపోర్ట్‌తో పాటు అభినయ్‌ రాసిన సూసైడ్‌ నోట్‌ పోలీసులకు కనిపించింది. అందులో ‘నాకు మా అమ్మకు ఆరోగ్య సమస్యలున్నాయి. 

నాకు తండ్రి కూడా లేడు. మా బంధువుల కోసం వెతక్కండి. ఐ యామ్‌ సారీ’ అని ఇంగ్లి‹Ùలో రాసి ఉంది. తల్లి లక్ష్మి అనారోగ్యంతో చనిపోవడంతో తట్టుకోలేక కుమారుడు అభినయ్‌ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. వీరు మృతి చెంది రెండ్రోజులు అవుతోందని చెబుతున్నారు. తల్లీకొడుకుల మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.   

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)