Breaking News

గుండె స‌మీపానికి ర‌క్తం గ‌డ్డ‌..యువ‌కుడ్ని కాపాడిన వైద్యులు

Published on Sun, 11/30/2025 - 12:49

హైద‌రాబాద్: విప‌రీత‌మైన క‌డుపునొప్పి, మూడు రోజులుగా రెండు కాళ్లూ విప‌రీత‌మైన నొప్పులు, ఊపిరి అంద‌ని ప‌రిస్థితిలో 30 ఏళ్ల క‌న్న‌డ యువ‌కుడిని అమీర్‌పేట‌లోని ఆస్టర్ ప్రైమ్ ఆస్ప‌త్రికి తీసుకొచ్చారు. వెంట‌నే అత‌డికి త‌గిన వైద్య‌ప‌రీక్ష‌లు చేస్తే.. ర‌క్తం గ‌డ్డ‌క‌ట్టి, అది అత్యంత ప్ర‌మాద‌క‌రంగా శ‌రీరంలోని భాగాల నుంచి గుండెకు ర‌క్తాన్ని తీసుకెళ్లే ప్ర‌ధాన ర‌క్త‌నాళంలోకి చేరింద‌ని తేలింది. ఇది మ‌రికొద్ది దూరం ప్ర‌యాణించి ఉంటే, రోగి ప్రాణాల‌కే ముప్పు క‌లిగేది. ఈ కేసుకు సంబంధించిన వివ‌రాల‌ను ఆస్ట‌ర్ ప్రైమ్ ఆస్ప‌త్రికి చెందిన సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ న్యూరోస‌ర్జ‌న్, న్యూరోస‌ర్జ‌రీ విభాగాధిప‌తి డాక్ట‌ర్ రంగ‌నాథం పైడి తెలిపారు.

“గుట్కా బాగా తినే అల‌వాటున్న ఆ యువ‌కుడి ప‌రిస్థితిని క్షుణ్నంగా ప‌రీక్షించాం. అత‌డి రెండు తొడ‌లూ బాగా గ‌ట్టిగా అయిపోయాయి. దానికితోడు ఇత‌ర స‌మ‌స్య‌లు కూడా ఉన్నాయి. కార‌ణం ఏంటా అని చూస్తే బైలేట‌ర‌ల్ ప‌ల్మ‌న‌రీ ఎంబోలిజం (పీఈ) అని తేలింది. దానికితోడు ర‌క్తం గ‌డ్డ‌క‌ట్టి ఆ ర‌క్తంగ‌డ్డ గుండెవ‌ర‌కు వెళ్తోంది. ఈ ప‌రిస్థితిని చూడ‌గానే ప‌లు విభాగాల‌కు చెందిన వైద్యులు వెంట‌నే స్పందించాం. 

అత‌డికి పెనంబ్రా లైట్నింగ్‌ను ఉప‌యోగించి వెంట‌నే ర‌క్తం గ‌డ్డ‌ను తొల‌గించ‌డంతో పాటు ఐవీసీ ఫిల్ట‌ర్ అమ‌ర్చాం. ప‌ల్మ‌న‌రీ యాంజియోగ్రామ్ కూడా చేశాం. బాగా రిస్కుతో కూడుకున్న‌, అత్యంత సంక్లిష్ట‌మైన ఈ చికిత్స‌ను సీనియ‌ర్ న్యూరోస‌ర్జ‌న్ డాక్టర్ రంనాథం పైడి మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో వాస్క్యుల‌ర్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ గ‌ణేశ్వ‌ర‌రావు నిర్వ‌హించారు. ఇందులో ప‌లు విభాగాల‌కు చెందిన వైద్య‌నిపుణులు కూడా పాల్గొన్నారు. స‌మ‌యానికి స‌రైన చికిత్స చేయ‌డంతో యువ‌కుడు క్ర‌మంగా కోలుకున్నాడు. అత‌డి స‌మ‌స్య‌ల‌న్నీ స‌మ‌సిపోయాయి.”

దీని గురించి డాక్ట‌ర్ గ‌ణేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ, “ఇది చాలా సంక్లిష్ట‌మైన కేసు. ర‌క్త‌పుగ‌డ్డ‌లు చాలా ప్ర‌మాద‌క‌రంగా గుండెకు అత్యంత స‌మీపానికి వెళ్లిపోయాయి. స‌రైన రోగ‌నిర్ధార‌ణ‌, అన్ని విభాగాల వైద్యుల స‌మిష్టి కృషి, అత్యాధునిక వాస్క్యుల‌ర్ ఇంట‌ర్వెన్ష‌న్ ప‌రిక‌రాలు ఉండ‌డమే అత‌డిని మృత్యుముఖం లోంచి బ‌య‌ట‌కు తీసుకొచ్చింది” అన్నారు.

ఈ కేసు గురించి డాక్ట‌ర్ రంగ‌నాథం పైడి మాట్లాడుతూ, “ఆస్ట‌ర్ ప్రైమ్ ఆస్ప‌త్రిలో ఇలాంటి సంక్లిష్ట‌మైన కేసుల‌కు అన్ని విభాగాల స‌మ‌న్వ‌యంతో వైద్యం చేయాల‌ని మేం బ‌లంగా న‌మ్ముతాం. స‌మ‌స్య ఏంట‌న్న‌ది త్వ‌ర‌గా గుర్తించ‌డంతో పాటు వివిధ విభాగాల మ‌ధ్య స‌రైన స‌మ‌న్వ‌యం కుదుర్చుకోవ‌డం ఇలాంటి అత్య‌వ‌స‌ర కేసుల చికిత్స‌లో చాలా ముఖ్యం. అది స‌రిగ్గా చేయ‌డం వ‌ల్ల‌నే ఇత‌డి ప్రాణాలు కాపాడ‌గలిగాం. 

ఈ యువ‌కుడిని ఎక్క‌డో క‌ర్ణాట‌క‌లోని క‌ల‌బురిగి స‌మీపంలో ఉన్న ఒక గ్రామం నుంచి.. అంటే ఏకంగా 230 కిలోమీట‌ర్ల దూరం నుంచి ఇక్క‌డ‌కు తీసుకొచ్చారు. గ‌తంలో నేను చికిత్స చేసిన ఒక న్యాయ‌వాది ఇత‌డిని పంపారు. రోగుల‌కు వైద్యుల మీద ఉండే న‌మ్మ‌కం ఇలాంటి కేసుల్లో చాలా కీల‌క‌పాత్ర పోషిస్తుంది. అందుకే ఆస్ట‌ర్ ప్రైమ్ ఆస్ప‌త్రికి చాలా దూరం నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా రోగులు వ‌స్తుంటారు. ముఖ్యంగా క‌ర్ణాట‌క చుట్టుప‌క్క‌ల ప్రాంతాల నుంచి ఇలాంటి కేసులు వ‌స్తాయి. వీటిని న‌యం చేస్తామ‌న్న న‌మ్మ‌కం ఉండ‌డం వ‌ల్లే వాళ్లంతా వ‌స్తారు” అని తెలిపారు.

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)