Breaking News

బీజేపీకి ఎనిమిది సీట్లు ఎలా?

Published on Wed, 06/05/2024 - 10:55

సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అనుకున్న లక్ష్యాలకు పూర్తి భిన్నంగా ఫలితాలు రావడంపై ఆ పార్టీ హైకమాండ్‌ విస్మయం వ్యక్తం చేసింది. ఆరు నెలల కిందటే అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మొత్తం 17 సీట్లకు గానూ 14 సీట్లు వస్తాయని భావించినా, కేవలం 8 సీట్లు రావడం, అంతగా క్షేత్రస్థాయి బలం లేని బీజేపీ ఏకంగా 8 స్థానాలను గెలవడం పార్టీ పెద్దలను కలవరానికి గురి చేసింది. రాష్ట్ర ప్రభుత్వంపై ఈ ఫలితాల ప్రభావం పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు రాష్ట్ర నేతలతో  పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించే అవకాశాలున్నాయని ఏఐసీసీ వర్గాల ద్వారా తెలుస్తోంది. 

సీఎం సొంత జిల్లాలోనూ ఓటమా?
తెలంగాణలో ప్రస్తుత ఎన్నికల్లో కనీసంగా 14 సీట్లు గెలవాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సహా ముఖ్య నేతలను కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఆదేశించింది. దీనికి అనుగుణంగా ప్రణాళికలు ఉండాలని సూచించింది. హైకమాండ్‌ సూచనల మేరకు కాంగ్రెస్‌ పార్టీ తన కార్యాచరణను రూపొందించుకొని అభ్యర్థుల ఎంపిక మొదలు ప్రచారం, బూత్, పోల్‌ మేనేజ్‌మెంట్‌ బాధ్యతలకు మంత్రులకు కట్టబెట్టింది. ఇందులో భాగంగా సీఎం స్వయంగా తన సొంత జిల్లా మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ ఇంచార్జిగా వ్యవహరించారు. ఆ జిల్లాలోనే పకడ్భందీగా వ్యవహరించినప్పటికీ ఏఐసీసీ కార్యదర్శి, అభ్యర్ధి వంశీచంద్‌రెడ్డి ఓటమి పాలవ్వడంపై హైకమాండ్‌ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లోక్‌సభ పరిధిలో ఏడుకు ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ అభ్యర్ధి ఓడటంపై 
వారు స్వయంగా ముఖ్యమంత్రినే ఆరా తీసినట్లు తెలసింది.

మల్కాజిగిరిలో బీజేపీకి 3లక్షలు మెజారిటీనా?
ఇక గతంలో సీఎం రేవంత్‌ స్వయంగా గెలిచిన మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోనూ కాంగ్రెస్‌ ఓడటం,, బీజేపీ అభ్యర్ధికి ఏకంగా 3 లక్షల పైచిలుకు మెజార్టీ రావడంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ రాష్ట్ర ముఖ్య నేతలను ప్రశ్నించినట్లు సమాచారం. కేవలం ఆరు నెలల వ్యవధిలో ఇంతమార్పు ఎందుకు జరిగింది?, పార్టీ నేతల మధ్య సమన్వయం లేదా?,మరే ఇతర కారాణాలున్నాయా? అని ఆయన ఆరా తీసినట్లు తెలిసింది. చాలామంది రాష్ట్ర నేతలు బీజేపీ గాలి వీచిందని చెప్పగా, అభ్యర్థుల ఎంపికలో తొందరపాటు నిర్ణయాలు ఉన్నాయని మరికొందమంది చెప్పినట్లుగా చెబుతున్నారు. ముఖ్యంగా చేవెళ్ల, మల్కాజ్‌గిరి, కరీంనగర్, సికింద్రాబాద్‌ నియోజకవర్గాల పరిధిలో అభ్యర్థుల ఎంపిక పూర్తి ఏకపక్షంగా జరిగిందనే వాదనను కొందరు తెరపైకి తెచ్చినట్లు తెలిసింది. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)