Breaking News

నళినికి వెంటనే ఉద్యోగ బెనిఫిట్స్‌ ఇవ్వాలి

Published on Tue, 09/23/2025 - 01:20

సాక్షి, యాదాద్రి: తీవ్ర అనారోగ్యానికి గురైన తెలంగాణ ఉద్యమకారిణి, మాజీ డీఎస్పీ నళినికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఉద్యోగ బెనిఫిట్స్‌ను వెంటనే విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు. సోమవారం పార్టీ ప్రతినిధులతో కలిసి భువనగిరిలోని నళిని ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించారు. ఈ సందర్భంగా నళిని తన అనారోగ్య సమస్యను బీజేపీ నేతలకు తెలియజేశారు.

అనంతరం రాంచందర్‌రావు మాట్లాడుతూ సీఎం రేవంత్‌ గతంలో ఆర్థిక ప్రయోజనాలను ఇప్పిస్తానని హామీ ఇచ్చినా అమలు చేయలేదని నళిని చెప్పారన్నారు. దీంతో ఆమె మానసికంగా కుంగిపోయి ఆరోగ్యం క్షీణించిందన్నారు. ప్రధాని మోదీని కలవాలని ఉందని నళిని చెప్పారని.. ఇందుకోసం పార్టీ తరఫున ప్రధాని అపాయింట్‌మెంట్‌ తీసుకుంటానన్నారు. ఆమెకు యోగా గురువు రామ్‌దేవ్‌ బాబాతో వైద్యం చేయిస్తామని పేర్కొన్నారు. ‘నా ఆరోగ్యం బాగా దెబ్బతింది. నా జీవితాశయం యోగశాల నిర్మాణం పూర్తి చేయాలి.

ప్రభుత్వం నుంచి నాకు రావాల్సిన డబ్బు వస్తే యోగశాల నిర్మాణానికి ఖర్చుచేస్తా. నాకు ఏ ఇతర ఆర్థిక సాయం అవసరం లేదు’అని ఆమె రాంచందర్‌రావుకు వివరించారు. రాంచందర్‌రావు వెంట బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల ఆశోక్, ఉపా«ధ్యక్షుడు డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్, కాసం వెంకటేశ్వర్లు, నాయకులు ఊట్కూరి ఆశోక్‌గౌడ్, గూడురు నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఉన్నారు.  

నళినికి భువనగిరి కలెక్టర్‌ పరామర్శ 
సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశంతో భువనగిరి కలెక్టర్‌ హనుమంతరావు సోమవారం భువనగిరిలో నళినిని నివాసానికి వెళ్లి ఆమెను పరామర్శించారు. సర్విస్‌ సమస్యలు ఏమైనా ఉంటే నిబంధనల మేరకు త్వరలోనే పరిష్కరిస్తామని సీఎం చెప్పినట్లు కలెక్టర్‌ ఆమెకు వివరించారు. ప్రభుత్వం సహాయం చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. కాగా, నళిని అభ్యర్థన మేరకు తప్పకుండా తాను ప్రధానికి లేఖ రాసి వైద్య సాయం అందేలా చూస్తానని మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)