Breaking News

19 జిల్లాలకు బీజేపీ అధ్యక్షుల నియామకం

Published on Tue, 02/04/2025 - 06:08

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ సంస్థాగత ఎన్నికలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. సంస్థాగతంగా పార్టీని 38 జిల్లాలుగా విభజించగా, సోమవారం 19 జిల్లాలకు మాత్రమే అధ్యక్షులను ప్రకటించారు. ఈ జిల్లాల్లో రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుల పేర్లను కూడా ప్రకటించారు. అయితే కొన్ని జిల్లాల్లో అధ్యక్షుల పేర్లపై ఏకాభిప్రాయం కుదరలేదని, సామాజిక వర్గాల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేలా కూర్పు ఇంకా పూర్తిస్థాయిలో సాధ్యం కాలేదని తెలుస్తోంది.

ఏకాభిప్రాయం కుదరని కొన్ని జిల్లాల్లో రాష్ట్ర, జిల్లా నాయకత్వాలు ప్రతిపాదించిన పేర్లపై స్థానిక నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్టు పార్టీవర్గాలు చెబుతున్నాయి. కొన్నిచోట్ల స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం జిల్లా అధ్యక్షులుగా ప్రతిపాదించిన వారి విషయంలో అసంతృప్తి వ్యక్తం చేయడంతో నియామకాలు ఆగినట్టుగా తెలిసింది. ఇప్పటివరకు ప్రకటించిన 19 జిల్లాల్లో ఒక్క మహిళకు కూడా అవకాశం దక్కలేదు.  

8 జిల్లాల్లో ఏకాభిప్రాయం దిశగా.. 8 జిల్లాలకు సంబంధించి ఏకాభిప్రాయం కుదిరే దిశగా 
కసరత్తు జరుగుతోంది. మొత్తం 38 జిల్లాలకు గాను యాభై శాతానికి పైగా అంటే 20కు పైగా జిల్లాలకు అధ్యక్షులను ఎన్నుకుంటేనే రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నిక లేదా నియామకానికి అవకాశం ఉంటుంది. అందువల్ల వారం, పది రోజుల్లో 8 జిల్లాలకు కూడా అధ్యక్షులను ప్రకటిస్తే మొత్తం 27 జిల్లాలకు అధ్యక్షులను నియమించినట్టు అవు తుందని చెబుతున్నారు. రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడు నియమితులయ్యాక మిగిలిన 11 జిల్లాలకు అధ్యక్షులను ఖరారు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రకటించిన 19 జిల్లాలను చూస్తే...రెడ్డి–6, ఎస్సీ–1, వైశ్య–2, బీసీలు–10 మంది ఉన్నట్టుగా తేలింది. ఇక త్వరలో ప్రకటించే 8 జిల్లాల్లో ఒకటి మహిళకు, ఆ తర్వాత ఖరారు చేసే 11 జిల్లా ల్లో కూడా మరో రెండు లేదా మూడు జిల్లాలకు మహిళలకు అవకాశం లభించవచ్చునని అంచనా వేస్తున్నారు.  

19 జిల్లాల అధ్యక్షులు వీరే.. 
పతంగి బ్రహ్మానంద‌ (ఆదిలాబాద్‌ జిల్లా), వెంకటేశ్వర్‌గౌడ్‌ (మంచిర్యాల), శ్రీశైలం ముదిరాజ్‌ (ఆసిఫాబాద్‌), దినేష్‌ కులాచారి (నిజామాబాద్‌), నీలం చిన్నరాజులు (కామారెడ్డి), రాచకొండ యాదగిరిబాబు (జగిత్యాల), కర్రే సంజీవ్‌రెడ్డి (పెద్దపల్లి), వి.రాధామల్లేష్‌ గౌడ్‌ (మెదక్‌), బుద్ధి శ్రీనివాస్‌ (మేడ్చల్‌–మల్కాజిగిరి), నాగం వర్షిత్‌రెడ్డి (నల్లగొండ), పి.శ్రీనివాసరెడ్డి (మహబూబ్‌నగర్‌), దుప్పలి నారాయణ (వనపర్తి), కొలను సంతోష్‌రెడ్డి (హనుమకొండ), గంట రవికుమార్‌ (వరంగల్‌), నిశిధర్‌రెడ్డి (భూపాలపల్లి), సౌడ రమేష్‌ (జనగామ), సిరికొండ బలరాం (ములుగు), గుండగోని భరత్‌గౌడ్‌ (మహంకాళి సికింద్రాబాద్‌), లంకాల దీపక్‌రెడ్డి (హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా) లను అధ్యక్షులుగా బీజేపీ ప్రకటించింది.

#

Tags : 1

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)