Breaking News

తెలంగాణలో బర్డ్‌ఫ్లూ.. అధికారుల ఇంటింటి సర్వే

Published on Fri, 04/04/2025 - 07:46

సాక్షి, అబ్దుల్లాపూర్‌మెట్‌: తెలుగు రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ టెన్షన్‌ పెడుతోంది. ఇప్పటికే ఏపీలో పలు జిల్లాలో బర్డ్‌ ఫ్లూ ప్రభావం కొనసాగుతోంది. ఇటీవలే బర్డ్‌ ఫ్లూ కారణంగా ఓ చిన్నారి చనిపోయింది. ఇక, తాజాగా తెలంగాణలో కూడా బర్డ్‌ఫ్లూ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లో కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకినట్లు అధికార యంత్రాంగం నిర్ధారించింది. దీంతో, గ్రామంలో అధికారులు ఇంటింటి సర్వే చేపట్టారు.

వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బాటసింగారంలోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లో కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకింది. రంగారెడ్డి జిల్లా పశువైద్య, పశు సంవర్థకశాఖ అధికారి డా.బాబు బేరి బర్డ్‌ఫ్లూ వెలుగు చేసిన ఫామ్‌ వద్ద సిబ్బందితో కలిసి కోళ్లను చంపి మట్టిలో పూడ్చేందుకు చర్యలు చేపట్టారు. సదరు పౌల్ట్రీ సామర్థ్యం 36వేల కోళ్లు కాగా.. వేలాది ఇప్పటికే మృతి చెందాయి. ఇంకా, గురువారం 17,521 కోళ్లు ఉన్నట్లు గుర్తించారు.

బాటసింగారానికి కిలో మీటరు పరిధిలోని అన్ని పౌల్ట్రీల్లో కోళ్లను పూడ్చనున్నారు. పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న వాటిల్లో నమూనాలు సేకరిస్తున్నారు. బ‍బర్డ్‌ ఫ్లూ పాజిటివ్‌ కారణంగా వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామంలో ఇంటింటి సర్వే చేపట్టి.. ఎవరైనా బర్డ్‌ఫ్లూ లక్షణాలతో ఉంటే వారి వివరాలు సేకరిస్తున్నారు. అధికారులు వైద్య బృందంతో గ్రామంలో సర్వే నిర్వహిస్తున్నారు.  

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)