Breaking News

రయ్‌.. రయ్‌.. గూబ గుయ్‌!

Published on Mon, 06/10/2024 - 10:31

బంజారాహిల్స్‌: రాత్రీ పగలూ తేడా లేకుండా మోడిఫైడ్‌ సైలెన్సర్‌తో భీకర శబ్దాలతో దూసుకెళ్తున్న స్పోర్ట్స్‌ బైక్‌లు, కార్లపై అటు ట్రాఫిక్‌ పోలీసులు, ఇటు లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు దృష్టిపెట్టారు. గడిచిన నెల రోజుల కాలంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, పంజగుట్ట, ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్, లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు మితిమీరిన వేగంతో చెవులు దద్దరిల్లే శబ్దంతో దూసుకెళ్తున్న వాహనాలను సీజ్‌ చేయడంతో పాటు సదరు వాహనదారులపై కేసులు నమోదు చేశారు. 

ఇంత చేస్తున్నా ఇంకా కొంతమంది యువకులు స్పోర్ట్స్‌ బైక్‌లు, కార్లలో రయ్‌ రయ్‌మంటూ దూసుకెళ్తూనే ఉన్నారు. రాత్రి 10 గంటల తర్వాతనే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, నెక్లెస్‌రోడ్డు, మాసబ్‌ట్యాంక్, మాదాపూర్, దుర్గం చెరువు ప్రాంతాల వైపు యువకులు రేసింగ్‌లకు పాల్పడుతూ బైక్‌లపై దూసుకెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ట్రాఫిక్, లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు ఉదయం 11 నుంచి గంట పాటు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు రెండు గంటలు మాత్రమే వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. తమ దృష్టికి వస్తే మాత్రమే కేసులు నమోదు చేస్తున్నారు. 

రాత్రి 7 తర్వాత తెల్లవారుజామున 6 గంటల వరకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ రహదారులపై బైక్‌లు, కార్లు మోత మోగిస్తూ దూసుకెళ్తుండగా వాహనదారులు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్నారు. చెవులు దద్దరిల్లే సౌండ్‌లతో నివాసితులు సైతం తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. రాత్రి 8 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు కనీసం వారానికి రెండు సార్లైనా ట్రాఫిక్, లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు వేర్వేరుగా వాహన తనిఖీలు చేపడితే పెద్ద ఎత్తున మోడిఫైడ్‌ సైలెన్సర్ల వాహనాలను పట్టుకోవచ్చని స్థానికులు సూచిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)