Breaking News

ఆస్తి కోసం భర్తను కిడ్నాప్ చేయించిన మొదటి భార్య.!

Published on Wed, 11/05/2025 - 07:46

అంబర్‌పేట: అంబర్‌పేట పరిధిలోని డీడీ కాలనీలో గత నెల 29న జరిగిన కిడ్నాప్‌ కేసును పోలీసుల ఛేదించారు. బాధితుడి మొదటి భార్యే కిడ్నాప్‌నకు సూత్రధారి అని తేల్చారు. ఈమేరకు మంగళవారం ఈస్ట్‌జోన్‌ డీసీపీ బాలస్వామి, అడిషనల్‌ డీసీపీ నర్సయ్య, ఏసీపీ హరిష్‌కుమార్‌లు మీడియాకు వివరాలు వెల్లడించారు. డీడీ కాలనీలో నివాసం ఉండే మంత్రి శ్యామ్‌ను అక్టోబరు 29న కొందరు వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. దీనిపై శ్యామ్‌ రెండో భార్య ఫాతిమా పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

కిడ్నాప్‌ వ్యవహారం ఇలా... 
శ్యామ్‌కు అమెరికాలో మాధవీలత అనే యువతితో వివాహం, అక్కడే విడాకులు జరిగాయి. వీరి మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఇద్దరు నగరానికి విచ్చేసి విడివిడిగా ఉంటున్నారు. శ్యామ్‌ అలీగా పేరు మార్చుకుని ఫాతమా అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. కాగా ఇటీవల శ్యామ్‌ బంజారాహిల్స్‌లో తనకు వారసత్వంగా వచి్చన ఆస్తిని సుమారు రూ.20 కోట్లకు విక్రయించాడు. అందులో తనకు వాటా కావాలని మాధవీలత భావించి కిడ్నాప్‌నకు ప్రణాళిక వేసింది. ఈ మేరకు తనకు పరిచయం ఉన్న పటేల్‌నగర్‌కు చెందిన దుర్గావినయ్‌ను సంప్రదించింది. దుర్గా వినయ్‌ రామ్‌నగర్‌లో నివసించే స్నేహితుడు కట్టా దుర్గాప్రసాద్‌ అలియాస్‌ సాయి సాయంతో కిడ్నాప్‌కు పథకం రచించారు. ఈమేరకు మొదట కూకట్‌పల్లికి చెందిన ప్రీతి, మలక్‌పేటకు చెందిన సరితలను బాధితుడు శ్యామ్‌ నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లోని ఎదురు ఫ్లాట్‌లో అద్దెకు దించి అతని కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు. అనంతరం ఈ నెల 29న కిడ్నాప్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. విద్యానగర్‌కు చెందిన కాటమోని పురుషోత్తం, పురానాఫూల్‌కు చెందిన సందోలు నరే కుమార్, ఆగాపురాకు చెందిన పవన్‌కుమార్, మంగళ్‌హాట్‌కు చెందిన నారాయణ రిషికేష్‌, పటేల్‌నగర్‌కు చెందిన పిల్లి వినయ్‌లతో కలిసి శ్యామ్‌ను కిడ్నాప్‌ చేశారు.  

పోలీసులకు తెలిసిందని... 
శ్యామ్‌ కిడ్నాప్‌పై పోలీసులకు ఫిర్యాదు అందిందని తెలిసి నిందితులు మొదట కిడ్నాప్‌నకు వినియోగించిన కారును చర్లపల్లిలో వదిలి వేరే వాహనంలో వెళ్లారు. అనంతరం మొదక్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తిరిగారు. రూ.30 లక్షలు డిమాండ్‌ చేయడంతో శ్యామ్‌ అతని స్నేహితుడు రఘునాథ్‌రెడ్డికి ఫోన్‌ చేసి డబ్బులు అడగడంతో పాటు కిడ్నాప్‌ అయినట్లు సమచారం ఇచ్చారు. అప్పటికే పోలీసులు ముమ్మరంగా గాలిస్తుడడంతో కిడ్నాపర్లు విజయవాడకు వెళ్లారు. ఈ విషయాన్ని ఎలా ముగించాలని కిడ్నాపర్లు మాధవీలతను సంప్రదించగా ఆమె సరిగ్గా స్పందించలేదు. దీంతో బాధితుడు తానే డబ్బులు ఇస్తానని కిడ్నాపర్లను నమ్మించి బంజారాహిల్స్‌లోని ఓ బ్యాంకుకు తీసుకువెళ్లాడు. అక్కడ శ్యామ్‌ కిడ్నాపర్ల నుంచి తప్పించుకుని పోలీసుల చెంతకు చేరి జరిగింది వివరించాడు. దీంతో కిడ్నాపర్లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి మూడు కార్లు, రెండు ద్విచక్రవాహనాలు, 8 సెల్‌ఫోన్లను స్వా«దీనం చేసుకున్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)