Breaking News

ఆదిలాబాద్‌లో పెద్దపులి హల్‌చల్‌

Published on Fri, 11/22/2024 - 04:57

నార్నూర్‌: ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్, గాదిగూడ మండలాల్లో గత నాలుగు రోజులుగా పెద్దపులి  హల్‌చల్‌ చేస్తోంది. గత రెండ్రోజులుగా నార్నూర్‌ మండలం చోర్గావ్‌ గ్రామంలో తిష్టవేసి ఆవును తింటున్న దృశ్యం అటవీశాఖ అధికారులు అమర్చిన కెమెరాకు చిక్కింది. దీంతో చోర్గావ్, సుంగాపూర్, బాబేఝరి, మంజ్రి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. 

గురువారం గాదిగూడ మండలం ఖడ్కి గ్రామం మీదుగా బుడుకుంగూడ, సావురి గ్రామం మీదుగా రాంపూర్‌ చేరుకుంది. వేకువజామున గిరిజన రైతు ప్రకాశ్‌కు చెందిన ఆవుపై దాడి చేసింది. కుటుంబ సభ్యులు అప్రమత్తమై చప్పుడు చేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇదేరోజు మధ్యాహ్నం నార్నూర్‌ మండలం తాడిహత్నూర్‌ గ్రామ శివారులో పత్తి ఏరుతున్న మహిళలకు పులి కనిపించడంతో భయంతో పరుగులు తీశారు. 

అక్కడి నుంచి గంగాపూర్, మాన్కాపూర్‌ వైపు పులి వెళ్లిందని ప్రచారం జరగడంతో మాన్కాపూర్, రాజులగూడ, నార్నూర్, మహగావ్, నాగల్‌కొండ, భీంపూర్‌ గ్రామాల ప్రజలు అప్రమత్తం అయ్యారు. వ్యవసాయ పనులకు వెళ్లిన వారంతా మధ్యాహ్నం ఇంటిబాట పట్టారు. ఎఫ్‌ఎస్‌వో సుదర్శన్‌ ఆధ్వర్యంలో అటవీ అధికారులు బృందాలుగా విడిపోయి పులి జాడకోసం గాలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)